Telangana: రైతులకు శుభవార్త.. వచ్చే మూడు రోజులు వర్షాలు..!
తెలంగాణలో వచ్చే మూడు రోజులు పాటు వర్షాలు(Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శనివారం ప్రకటన విడుదల చేసింది. వర్షానికి ముందు, వర్ష సమయంలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది.
సోమవారం మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

బుధవారం రాజన్న సిరిసిల్ల, వరంగల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ మూడు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. శనివారం సాయింత్ర పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో వర్షం పడింది. ఈదురుగాలులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది.












Click it and Unblock the Notifications