Rains: అకాల వర్షాలతో ఇబ్బందుల్లో అన్నదాతలు.. మరో రెండు రోజులు వానలు పడే ఛాన్స్..
తెలంగాణలో అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వరి మొత్తం కోత పూర్తి కాగా.. వడ్లు మార్కెట్ యార్డ్లు, ఐకేపీ సెంటర్లలో ఉన్నాయి. భారీ వర్షాలతో మార్కెట్, ఐకేపీ సెంటర్లలో ఉన్న వడ్లు తడిసిపోయాయి. కొన్ని చోట్ల వర్షపు నీటికిక ధాన్యం కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం, ఖాసీంపేట, పారువెల్లలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో ఐకేపీ సెంటర్లలో ఉన్న వడ్లు తడిసిపోయాయి.
పారువెళ్ల ఐకేపీ సెంటర్లలో భారీగా ధాన్యం ఉండడంతో పాటు, త్వరగా కొనుగోలు చేయకపోవడం వడ్ల రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి. దీంతో రైతులు ధాన్యానికి కాపలాగా అక్కడే ఉండాల్సి వస్తుంది. సోమవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పక్క ఊళ్ల నుంచి కూడా ధాన్యం వస్తుందని.. తమకు అందుకే లేట్ అవుతుందని అన్నదాతలు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వానలు పడే అవకాశం వివరించింది.

దీని వల్ల రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications