MGNREGS: ఉపాధి హామీ పథకం.. తెలంగాణలో 1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులు తొలగింపు!

MGNREGS: 2023-24 మధ్య కాలంలో తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 1,21,422 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఎంపీ ఎస్.వెంకటేశన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానమిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షలకు పైగా(68,86,532) మంది కార్మికులను, తొలగించారని, 2022-23లో 86,17,887 మంది కార్మికులను తొలగించారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాల వారీగా డేటాను కూడా మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి 1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులను తొలగించినట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 3,60,80 మంది కార్మికులను ఉపాధి జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది.

నకిలీ,తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాల వల్ల ఉపాధి హామీ పథకంలో తొలగింపులు జరిగాయని మంత్రి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెటీరియల్ కాంపోనెంట్స్ కోసం పెండింగ్ నిధులు రూ.282.74 కోట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు రూ.15.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. దేశంలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఉపాధి హామీ పథకం కోసం వాస్తవ విడుదల మొత్తాలు ప్రారంభ బడ్జెట్ అంచనాలను మించిపోయాయి. దీనిని బట్టి ఉపాధి పొందేవారి సంఖ్య అర్థం అవుతుంది.

MGNREGS Removal of Over 1 21 Lakh Job Cards in Telangana

2020-21 ఆర్థిక సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వం రూ. 61,500 కోట్లు కేటాయించింది. కానీ చివరికి రూ. 1,11,170.86 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ సంఖ్య తరువాతి సంవత్సరాల్లో తగ్గుదల కనిపించింది: 2021-22లో, విడుదల రూ. 98,467.84 కోట్లకు తగ్గించబడింది. 2022-23లో రూ. 90,810.99 కోట్లకు తగ్గించబడింది.2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రారంభంలో రూ. 60,000 కోట్ల కేటాయింపును ప్రకటించినప్పటికీ, వాస్తవానికి విడుదల రూ. 89,268.30 కోట్లుగా ఉంది.

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అంటే ఏమిటి?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అనేది గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన కార్యక్రమం. నైపుణ్యం లేని కార్మికులకు కనీసం 100 రోజుల హామీ వేతన ఉపాధిని అందిస్తుంది.2005లో ఆమోదించబడిన భారతీయ పౌరులకు 'పని చేసే హక్కు'ను అందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద ఈ పథకం ప్రవేశపెట్టబడింది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కార్మికులకు జీవనోపాధి భద్రతను పెంచడమే ఈ పథకం లక్ష్యం.

ఈ పథకం అమలు బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఉందని మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. జాబ్ కార్డులను అప్ డేట్ చేయడం తొలగించడం అనేది రాష్ట్రాలు నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపారు. అయితే జాబ్ కార్డులను తొలగించే సమయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులను రద్దు చేయలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+