హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు: జనం పరుగులు
హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీంతో జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే రూట్‌లో ఉన్న ప్రాంతాలు స్వల్పంగా కంపించా
హైదరాబాద్: నగరంలో శనివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీంతో జనం ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పలువురు తమ ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.
యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే రూట్‌లో ఉన్న ప్రాంతాలు స్వల్పంగా కంపించాయి. రహ్మత్‌నగర్ డివిజన్‌లోని హెచ్‌ఎఫ్ నగర్, ఇందిరా నగర్, ప్రతిభా నగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 3 నుంచి 3.30 గంటల ప్రాంతంలో భూమి స‍్వల‍్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు.

భూప్రకంపనల వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. భూమి కంపించిన ప్రాంతాల్లో ఉదయం ఎమ్మార్వో సైదులు, కార్పొరేటర్ షఫీ పర్యటించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications