Subhan Khan: పోతే ఒక్కడినే.. బతికితే 9 మంది.. సుభాన్ ఖాన్ కు సన్మానం..

సుభాన్ ఖాన్.. సుభాన్ ఖాన్.. సోషల్ మీడియాలో ఈ పేరు మారు మోగి పోతోంది. ఇంతకీ ఈ సుభాన్ ఖాన్ ఏం చేశాడంటే.. వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడాడు. పోతే ఒక్కడినే.. బతికితే 9 మంది అనే సాహసంతో తొమ్మిది మందిని రక్షించాడు. దీంతో అతని పేరు సోషల్ మీడియాలో మారు మోగుతోంది. అతన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఖమ్మం వరదల్లో చిక్కుకున్న 9 మందిని సుభాన్ ఖాన్ జేసీబీ సహాయంతో కాపాడు.

ఖమ్మం జిల్లాలోని మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ వంతెనపై 9 మంది చిక్కుకున్నారు. తమను కాపాడాలని వారు అభ్యర్థించారు. ప్రభుత్వం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అది వారి దగ్గరికి చేరుకోలేకపోయింది. దీంతో సుభాన్ ఖాన్ వెళ్లి తొమ్మిది మందిని రక్షించాడు. సుభాన్ ఖాన్ మొదటి సారి కాస్త దూరం వెళ్లి భయంతో తిరిగి వచ్చాడు. రెండో సారి కూడా వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చాడు.

MIM honors Subhan Khan for saving flood victims in Khammam district

కానీ మూడోసారి పోతే ఒక్కడినే.. కానీ బతికితే 9 మంది అని నిర్ణయించుకున్నాడు. జేబీసీతో వరదలోకి వెళ్లి వారిని కాపాడాడు. సుభాన్ ఖాన్‌ను అతని ధైర్యసాహసాలకు గాను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (AIMIM) శనివారం అతన్ని సన్మానించింది.
ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు సుభాన్‌ను దర్రస్ సలామ్ వద్ద కలుసుకుని రూ.51,000 చెక్కును అందజేశారు.

ఖాన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం అందించాలని, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం కింద 2 బిహెచ్‌కె ఫ్లాట్‌ను అందించాలని ఒవైసీ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కోరారు. హర్యానాలోని మేవాత్ జిల్లాకు చెందిన ఖాన్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లాలో జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తొమ్మిది మందిని రక్షించిన తర్వాత జేసీబీ రిపేర్ వచ్చినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+