హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంఐఎం ఎమ్మెల్యే హల్‌చల్: ఫ్లై ఓవర్‌పై బ్యారికేడ్లు తెరిచి దౌర్జన్యం..(వీడియో)

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, చార్మినార్‌, కార్వాన్‌‌ జోన్లలో వైరస్ కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. 4 జోన్లు కంటైన్మెంట్ జోన్లు అని.. కఠినంగా నిబంధనలు అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. కానీ ఎంఐఎం ఎమ్మెల్యే మాత్రం లాక్ డౌన్ నిబంధనలను బ్రేక్ చేశారు. ఆ వీడియో ఒకటి వైరలవుతోంది.

 మీ మొబైల్ ఫోన్లు మంచి కరోనా వాహకాలు! జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు మీ మొబైల్ ఫోన్లు మంచి కరోనా వాహకాలు! జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు

mim mla violates lockdown rules in malakpet..

మలక్ పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలాలా శుక్రవారం డబీర్ పురా ప్లై ఓవర్ తెరవాలని ఒత్తిడి చేశారు. ప్లై ఓవర్‌పై ఉన్న కానిస్టేబుల్, సిబ్బందిపై ప్రెషర్ చేశారు. ఫ్లై ఓవర్ మూసివేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని ఆయన వాదిస్తున్నారు. తన అనుచరులతో కలిసి బ్యారికేడ్లను తెరిచారు. తర్వాత కొన్ని వాహనాలు వెళ్లగా.. తన కారులో వెళ్లిపోయారు.

అక్కడున్న సిబ్బంది అహ్మద్ బిన్ అబ్దుల్లా వాదనకు కూడా దిగారు. వాదనలు అంతా వీడియోలో రికార్డయ్యాయి. అబ్దుల్లా.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడు. ఓవైసీతో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అబ్దుల్లా వాదనను బీజేపీ ఖండించింది.

మలక్ పేట కరోనా వైరస్ క్లస్టర్‌గా కొనసాగుతోంది. కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా నిబంధనలు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినా... డబీర్ పురాలో ఘటన జరగడం చర్చకు దారితీసింది. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని కూడా అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు.

English summary
mim Malakpet mla Ahmed Bin Abdullah Balala on Friday reportedly violated lockdown norms and forced police to remove barricades put by the administration on Dabeerpura fly over in Hyderabad old city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X