కేంద్రమంత్రి మెచ్చుకున్నారు: హరీష్, తేజ్‌దీప్ చరిత్ర తెలుసుకొని.. (పిక్చర్స్)

మెదక్: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చెరువుల భూములు కబ్జాకు గురయ్యాని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం అన్నారు. మిషన్ కాకతీయకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కితాబిచ్చారని చెప్పారు.

మిషన్ కాకతీయలో భాగంగా అమీన్ పూర్ పెద్ద చెరువులో హరీష్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రూ.3 కోట్లతో అమీన్ పుర చెరువును మినీ ట్యాంక్ బండుగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ప్రకృతి సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చెరువులు అన్యాక్రాంతమయ్యాయని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రకృతి సంపదకు నెలవైన చెరువులు ఆగమయ్యాయన్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

ఊరు.. చెరువు మనది అని ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడే చెరువులకు పూర్వవైభవం వస్తుందని హరీష్ రావు అన్నారు. చెరువుల పునురుద్ధరణలో పోలీసు శాఖ పాల్గొనడం హర్షణీయమన్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రశంసించారని హరీశ్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువును స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) డీజీ తేజీదీప్‌కౌర్ మీనన్ దత్తత తీసుకున్నారు.

 మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

'మనోహర: అమీన్ పూర్' పేరుతో నాలుగు నెలలుగా చెరువు సంరక్షణకు తేజ్ దీప్ కౌర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

ఇందులో భాగంగానే ఆదివారం చెరువు భూమిలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు నాలుగు వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని హరీష్ రావు మొక్కనాటి ప్రారంభించారు.

 మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

అనంతరం హరీశ్ మాట్లాడారు. ప్రకృతి ప్రేమికులు, ఇతరుల సహకారంతో డీజీ తేజ్‌దీప్‌కౌర్ పెద్ద చెరువును దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు.

 మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

అమీన్‌పూర్ చెరువు గొప్ప చరిత్రను తేజ్‌దీప్ వెలికితీశారని ప్రశంసించారు. ఈ చెరువుకు ఏటా 171 రకాల పక్షులు వస్తుంటాయని, 9 రకాల చేపలు, 41 రకాల సీతాకోక చిలుకలు, 13 రకాల ఉభయచరాలు, 10 రకాల అరుదైన మొక్కల వంటి ప్రకృతి సంపదతో చెరువు కళకళలాడేదన్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

పూర్వీకులు కాపాడిన ఈ చెరువు గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారిపోయిందన్నారు. ఇలాంటి తరుణంలో నాలుగు నెలల క్రితం చెరువు ప్రాముఖ్యత తెలుసుకున్న ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ దీని పరిరక్షణకు నడుంకట్టడం అభినందనీయమన్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

ప్రతి ఆదివారం 200 మంది పోలీసు సిబ్బందితో చెరువులోని చెత్తను తొలగించి రక్షణ బాధ్యతలు తీసుకున్నారని హరీష్ రావు కితాబిచ్చారు.

 మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

సైబీరియాతోపాటు వివిధ దేశాల నుంచి ఎన్నో పక్షులు ఇక్కడికి వచ్చి వెళ్లేవని, నాలుగునెలలుగా ఇక్కడ చేపట్టిన పరిరక్షణ చర్యలతో తిరిగి వలస పక్షులు రావడం గొప్ప విషయమన్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

చెరువులోకి చేరుతున్న మురుగునీటిని శుద్ధి చేయడాని ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెరువు ప్రాంతాన్ని బయోడైవర్సిటీ పార్క్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి బైనాక్యులర్‌తో చెరువులోని వివిధ రకాల పక్షులను పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+