మంత్రి ఎర్రబెల్లి కారు బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం, మండలం చిటూరు వద్ద అదుపు తప్పి పడిపోయింది. మంత్రి కారు వెనకాల వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు డ్రైవర్ పార్ధసారది, సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మృతిచెందారు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అటెండర్ తాతారావు, గన్ మెన్ నరేష్, పీఏ శివను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

minister errabelli dayakar rao car roll over, two dead, 3 injured

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముందు కారులో ఉన్నారు. దీంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాన్వాయ్‌లోని కారు ప్రమాదానికి గురైన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది.

minister errabelli dayakar rao car roll over, two dead, 3 injured

శనివారం అర్ధరాత్రి ఆక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+