ఎనుమాముల మార్కెట్లో గన్నీసంచుల గోల: అధికారులు, వ్యాపారుల పంచాయితీ తేల్చిన మంత్రి ఎర్రబెల్లి!!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో అధికారులకు వ్యాపారులకు గన్ని బ్యాగ్స్ విషయంలో చోటు చేసుకున్న వివాదానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇరువర్గాలను పిలిచి మాట్లాడిన మంత్రి నేటి నుండి వరంగల్ మార్కెట్ లో యధావిధిగా రైతుల నుండి కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.

మార్కెట్ లో కొనుగోళ్లకు వ్యాపారులను ఒప్పించిన మంత్రి ఎర్రబెల్లి

మార్కెట్ లో కొనుగోళ్లకు వ్యాపారులను ఒప్పించిన మంత్రి ఎర్రబెల్లి


గన్నీ బ్యాగుల అంశంపై హనుమకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు సంఘాల నాయకులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులతో సంయుక్త సమావేశం ఇచ్చారు.ఈ సమావేశంలో నేటి నుంచి మార్కెట్ ప్రారంభించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని వెల్లడించారు. రైతులు కూడా వీలైనంత వరకు మంచి బ్యాగులు వినియోగించాలని కోరారు.

గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చెయ్యటానికి కమిటీ

గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చెయ్యటానికి కమిటీ

మిగతా మార్కెట్ లలో గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు రైతులు, ఇద్దరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇద్దరు అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇక దీనిపై 26వ తేదీలోపు నివేదిక ఇస్తారని, నివేదిక ఇవ్వగానే మరోసారి సమావేశం పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం నిర్ణయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.అధ్వాన్న బస్తాలు, యూరియా బస్తాలు తప్ప మిగిలిన గన్ని బ్యాగ్ లకు 30 రూపాయలు వ్యాపారులు చెల్లిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

రైతులకు వ్యాపారులు సహకరించాలన్న మంత్రి ఎర్రబెల్లి

రైతులకు వ్యాపారులు సహకరించాలన్న మంత్రి ఎర్రబెల్లి

ఇక ఇదే సమయంలో గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై కమిటీ వేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అన్ని మార్కెట్లను అధ్యయనం చేసి 26వ తేదీ నివేదిక ఇస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మార్కెట్ కు వచ్చే రైతుకు నష్టం రాకుండా చూడాలని, రైతులకు సమస్యలు రాకుండా మనందరం పాటుపడాలని, రైతులకు వ్యాపారస్తులు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. అతుకుల గోనె సంచులకు 30 రూపాయలు ఇవ్వాలి. మరీ చినిగిన బస్తాలు వస్తే తిరస్కరిద్దామని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. పూర్తిగా చెడిపోయిన గోనె సంచులు, యూరియా బస్తాలను రిజెక్ట్ చేస్తే అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సౌండ్ గన్నీ విషయంలో కొంత మార్పులు చేస్తూ రేపే కొత్తగా తాత్కాలిక ఆర్డరు కలెక్టర్ ఇస్తారని పేర్కొన్నారు.

గన్నీ బ్యాగుల సమస్యపై మాట్లాడిన వరంగల్ జిల్లా కలెక్టర్

గన్నీ బ్యాగుల సమస్యపై మాట్లాడిన వరంగల్ జిల్లా కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై మాట్లాడుతూ సౌండ్ గన్ని బ్యాగ్ కు 30 రూపాయలు ఇవ్వాలనేది 2017 నుంచి అమలులో ఉందని, కొత్తగా వచ్చింది కాదన్నారు. గన్ని బ్యాగ్ లకు డబ్బు కట్ చేసే విధానం ఇప్పుడున్నది కాదని, దానిపై అవగాహన కలిగిస్తామని పేర్కొన్నారు. వ్యాపారస్తులు రైతుల విషయంలో సానుకూలంగా ఉండాలన్న కలెక్టర్ గోపి, సౌండ్ గన్ని కి ధర పెంచడం కోసం కమిటీ వేసి ముఖ్య మార్కెట్ లలో అధ్యయనం చేసి నిర్ణయం చేద్దామన్నారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తానికి తాజా సమావేశంతో రెండు వర్గాల మధ్య పంచాయతీకి తెరపడి నేడు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+