తెలుగుదేశం పార్టీని మరచిపోలేకపోతున్న మంత్రి ఎర్రబెల్లి... మ్యాటర్ ఏంటంటే
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంత కాలం తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అంటూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అసలు ఇంతకీ ఈ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడారు అంటే..
టంగ్ స్లిప్ అయిన మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని, మెడికల్ కళాశాలను, టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం భవనాలను సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు అధికారులతో కలిసి వాటిని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభిస్తారని టంగ్ స్లిప్ అయ్యారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వ్యాఖ్యలు .. నవ్వుకున్న సత్యవతి రాథోడ్
టిఆర్ఎస్ పార్టీ అని చెప్పడానికి బదులు ఆయన తెలుగుదేశం పార్టీ అని చెప్పడంతో, అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పక్కనే కొందరు టిఆర్ఎస్ పార్టీ అందించడంతో సారీ టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి తన తప్పు దిద్దుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ ఆయన చేసిన వ్యాఖ్యతో, పక్కనే కూర్చున్న మంత్రి సత్యవతి రాథోడ్ సైతం నవ్వుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలను కొందరు ఎర్రబెల్లికి టీడీపీ వాసన పోవడం లేదని, తెలుగుదేశం పార్టీ ని మర్చిపోలేక పోతున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

గతంలోనూ కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న కొత్త జాతీయ పార్టీ బీఎస్పీ అంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యలు
ఇక ఇది మాత్రమే కాదు గతంలో టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నారని, దసరా రోజున వరంగల్ వేదికగా చేసిన వ్యాఖ్యలలోనూ ఆయన టిఆర్ఎస్ పార్టీ అని చెప్పడానికి బదులు బిఎస్పి అని పేర్కొన్నారు. ఇక బిఎస్పి అనే మాటను పదే పదే చెప్పటంతో కెసిఆర్ పెట్టిన కొత్త పార్టీ పేరు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు గుర్తులేదు అని అప్పట్లో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ అని చెప్పడంతో మరోమారు మంత్రి వ్యాఖ్యలపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications