బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోశాడు.. కాబట్టే మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టారు!!

మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమిని టార్గెట్ చేసి, బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ రేంజ్ లో మండిపడ్డారు. బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోశాడు కాబట్టే ఢిల్లీ వరకు తెలిసేటట్లు మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డిని 18 వేల కోట్లకు కొని ఆయనను బలి పశువును చేసిందన్నారు.

ఎన్నికల కోసం ఆలయాల డ్రామా.. మునుగోడు ప్రజలు డ్రామాలకు తెరదించారు

ఎన్నికల కోసం ఆలయాల డ్రామా.. మునుగోడు ప్రజలు డ్రామాలకు తెరదించారు

హైదరాబాద్ లో ఎన్నికల కోసం భాగ్యలక్ష్మి టెంపుల్ ను, వరంగల్ ఎన్నికల కోసం భద్రకాళి ఆలయాన్ని, మునుగోడు ఎన్నికల కోసం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని నాటకం ఆడారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు బిజెపి నాయకుల నాటకాలకు తెరదించారని తెలిపారు. మునుగోడులో బిజెపి ఇచ్చిన హామీలను దేశం మొత్తం అమలు చేయాలని,ఆ మేరకు బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి మాట్లాడాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ను టార్గెట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి

కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ను టార్గెట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తేలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సిగ్గు లేదని మండిపడ్డారు. కరీంనగర్ లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్... ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటూ బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు. బిజెపి ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన కారణమని పేర్కొన్నారు.

మునుగోడు గెలుపు.. దేశ రాజకీయాలకు కీలక మలుపు

మునుగోడు గెలుపు.. దేశ రాజకీయాలకు కీలక మలుపు

అమిత్ షా, రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణ లో చిచ్చు పెట్టడానికే ఈ ఎన్నికలు తెచ్చారన్నారు. అక్కరలేని ఎన్నిక తెచ్చిన బిజెపికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని, మునుగోడు తీర్పు ఇచ్చిన ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను అన్నారు. భారత దేశ భవిష్యత్తును బంగారుమయం చేయడానికి కేసీఆర్, బిఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తమ తీర్పుతో దీవించారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మునుగోడు లో టీఆర్ఎస్ గెలుపు, మునుగోడు అభివృద్ధికి మలుపు.. దేశ రాజకీయాల్లో కీలక మలుపు అని పేర్కొన్నారు.

 ఎమ్మెల్యేల కొనుగోలును నిలదీసిన నిఖార్సైన విజయం

ఎమ్మెల్యేల కొనుగోలును నిలదీసిన నిఖార్సైన విజయం

మునుగోడు ప్రజలు కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఇది మునుగోడు ప్రజల విజయం, అధర్మంపై ధర్మం సాధించిన విజయం, కుట్రలు కుతంత్రాలు పై ప్రజల విజయం ఢిల్లీ అహంకారం పై మునుగోడు ఆత్మ గౌరవ విజయం అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

ఇక పెద్దల పై నిజమైన అభివృద్ధి విజయం సాధించిందని, అమ్ముడుపోయిన వ్యక్తిపై విజయం సాధించామని, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై మానవత్వం సాధించిన విజయమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కాంట్రాక్టులు, కమీషన్ల కక్కుర్తిపై ప్రజలు కన్నెర్ర చేసి టిఆర్ఎస్ పార్టీకి అందించిన ఘనవిజయం అని, ఎమ్మెల్యేల కొనుగోలును నిలదీసిన నిఖార్సైన విజయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

తెలంగాణాలో 5 ఉపఎన్నికల్లో మూడు స్థానాలు మావే

తెలంగాణాలో 5 ఉపఎన్నికల్లో మూడు స్థానాలు మావే

తెలంగాణలో 5 ఉపఎన్నికలు జరిగాయి.నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక, హుజురాబాద్,మునుగోడులలో ఉప ఎన్నికలు జరిగాయి.నాగార్జున సాగర్,హుజూర్ నగర్, మునుగోడు టీఆర్ఎస్ గెలిచింది. దుబ్బాక,హుజురాబాద్ సీట్లు మాత్రమే బిజెపి గెలిచిందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓట్ల శాతం కూడా పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. కేసీఆర్ ఉండగా తెలంగాణాను ఏం చెయ్యలేరు

ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. కేసీఆర్ ఉండగా తెలంగాణాను ఏం చెయ్యలేరు

తెలంగాణ రాష్ట్రానికి బిజెపి శత్రువని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు ఇచ్చిన వేటిని అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు అన్యాయం చేయడమే కాకుండా ఆఖరికి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కూడా చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా బిజెపి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఆటలు సాగవని, బీజేపీ పప్పులు ఉడకవు అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి బడా ఝూటా పార్టీ అని మండిపడ్డారు. కెసిఆర్ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రాన్ని బిజెపి ఏమీ చేయలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+