వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మంత్రాంగం ఫలించింది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చెనాక-కొర్టా బ్యారేజీ పనులకు సంబంధించిన సమస్యలపై మంగళవారం ముంబైలో ఇరురాష్ర్టాల నీటిపారుదల శాఖామంత్రుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సంతృప్తికరంగా ముగిసింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున వివిధ ప్రతిపాదనలను మహారాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి గిరీష్ మహాజన్‌కు మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఈ ప్రతిపాదనలను మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధులు ముంబైలోని మంత్రాలయం (సచివాలయం)లో సమావేశమయ్యారు.

దీంతో పాటు సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న లోయర్ గంగ ప్రాజెక్టుకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్టును నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి సంబంధించి త్వరలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఒప్పందం చేసుకోనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు.

 ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్


లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు దిగువన ఉన్న చనాక-కొర్టా బ్యారేజీ కోసం మహారాష్ట్రకు చెందిన రెండున్నర ఎకరాల భూమి అవసరమని మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని, భూసేకరణ కోసం కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటామని మంత్రి వివరించారు.

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్


మంత్రి హరీశ్‌రావు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను మహారాష్ట్ర ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించింది. మహారాష్ట్ర సీఎం అందుబాటులో లేకపోవడంతో మరోసారి ఇదే అం శాన్ని ఇరురాష్ర్టాల సీఎంల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈనెల 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్


చనాక-కొర్టా బ్యారేజీ అంశంతోపాటు లెండి ప్రాజెక్టుపైకూడా చర్చించారు. లెండి ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై ఇరురాష్ర్టాల ప్రతినిధులు సమీక్షించారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు ఇప్పటికే లెండి ప్రాజెక్టుపై రూ. 500 కోట్లకుపైగా ఖర్చు పెట్టినట్టు మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. పునరావాస సమస్య కారణంగా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖనుకూడా అందించారు.

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్

ఫలించిన హరీశ్ మంత్రాంగం: లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్


మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందంలో అటవీ, పర్యావరణ శాఖామంత్రి జోగురామన్న, ఎంపీ గొడం నగేశ్, ప్రభుత్వ సలహాదారు (అంతర్రాష్ట్ర వ్యవహారాలు) ధర్మపురి శ్రీనివాస్, సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, పెన్‌గంగ చీఫ్ ఇంజినీరు మధుసూదన్, ఎస్‌ఈ భగవంతరావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ఉన్నారు.

English summary
Major Irrigation Minister T Harish Rao along with a delegation of officials of the department will visit Mumbai on Tuesday to discuss the Penganga project issue with the Maharashtra government. The minister will seek the consent of the Maharashtra government for the construction of Chanaka-Korata barrage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X