ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన - మంత్రి కోమటిరెడ్డి ట్వీట్ల వెనుక..!!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ను ప్రకటించే సమయంలోనే ఒన్ మ్యాన్ షో ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. సీనియర్లకు మంత్రులుగా కీలక శాఖలు అప్పగించారు. రేవంత్ ప్రతీ విషయంలోనూ భట్టికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. ప్రధానితో భేటీ సమయంలోనూ భట్టి ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి తాజాగా వరుసగా చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 'కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం' అనే క్యాప్షన్‌తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను కలిసి ఉన్న ఫొటోను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలుత ట్వీట్ చేసారు. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సీఎం రేవంత్ ప్రస్తావన లేకుండా ఈ ఇద్దరి ఫొటోతో చేసిన ట్వీట్ కొత్త చర్చకు కారణమైంది. తాజాగా ఆయన మరోసారి ట్వీట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి, తాను ఉన్న ఫోటోలతో వీడియోను రూపొందించి పోస్ట్ చేశారు. ప్రముఖ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమాలోని పాటను వారిద్దరికి వర్తించేలా విడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వేగమొకడు… త్యాగమొకడు
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
గతము మరువని గమనమే.
ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.
సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ
కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం...#KomatiReddyVenkatReddy #BhattiVikramarkaMallu #TelanganaPrajaPrabhutwam@Bhatti_Mallu @INCTelangana pic.twitter.com/suzRsjMIrA
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 30, 2023
రేవంత్ ను పీసీసీ చీఫ్ గా నియమించిన సమయంలో కోమటిరెడ్డి వ్యతిరేకంగా కామెంట్స్ చేసారు. ఎన్నికల్లో..తరువాత రేవంత్ ను సీఎంగా ప్రకటించిన తరువాత మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. రేవంత్ మంత్రివర్గంలో కేబినెట్‌లో రోడ్లు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతులు నిర్వర్తిస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ శుభాకాంక్షలు చెబుతూ..2023లో కాంగ్రెస్ సాధించిన విజయం గురించి కోమటిరెడ్డి గుర్తు చేసారు. దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కోమటిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తి కరంగా మారింది. తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసారు.ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications