మళ్ళీ వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఆ వ్యాఖ్యలతో రేవంత్ కు షాక్!

తెలంగాణ మంత్రి కొండ సురేఖ మరొక కొత్త వివాదంలో పడ్డారు .తాజాగా ఆమె మంత్రుల పనితీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్ రెడ్డి షాక్ అయ్యేలా చేశారు. మంత్రులు ఎవరైనా పని చేయాలంటే, ఫైల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారని కానీ తాను డబ్బులు తీసుకోనని వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయరు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వరంగల్ లో ఒక కార్యక్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలు
వరంగల్ లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఐదు కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించ తలపెట్టిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. తన దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయని, అటవీ శాఖ మంత్రిని కావడంతో తన అనుమతుల కోసం ఎన్నో ఫైల్స్ వస్తాయని కొండా సురేఖ పేర్కొన్నారు.

Minister Konda Surekha in controversy again Revanth is shocked by her comments

Take a Poll

మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తారని చెప్పిన కొండా సురేఖ
మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు కానీ తాను అలా చేయనని, సమాజసేవ చేయమని పేర్కొన్నారు. తనకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పానని, ఒక కంపెనీ వాళ్ళను స్కూల్ డెవలప్మెంట్ చేయమని చెప్పి కోరానని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు రాజకీయ వర్గాలను చర్చకు కారణమవుతున్నాయి.

తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానన్న కొండా సురేఖ
మంత్రి హోదాలో ఉండి మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి. ఇక కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో దీనిపైన ఆమె స్పందించారు. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని దాని వరంగల్ లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని పేర్కొన్నారు.. గత ప్రభుత్వంలోని మంత్రులు ప్రతి ఫైలు క్లియర్ చేయడం కోసం ఎన్ని డబ్బులు తీసుకున్నారో వారందరికీ తెలుసని కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు .

కావాలని చేస్తున్న కుట్ర
తన వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారని, నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనుకను కట్ చేసి చిన్న చిన్న క్లిప్పులు చేసి ట్రోల్ చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మా క్యాబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, పనిచేస్తున్న మంత్రుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని కొండా సురేఖ హెచ్చరించారు.

వారికి సవాల్ విసిరిన కొండా సురేఖ
గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని , ఒక్కో మెట్టు ఎక్కి మంత్రిని అయ్యారని పేర్కొన్న కొండా సురేఖ తన పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో ఫైల్స్ క్లియర్ చేయటానికి జరిగింది , మంత్రులు చేసింది అదేనని పేర్కొన్న కొండా సురేఖ దీనిపైన బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా.. ఎక్కడికి వస్తారు రండి అంటూ సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+