ఆమెకు షాకిచ్చి.. మంత్రి కొండా సురేఖ మరో కాంట్రవర్సీ!
మంత్రి కొండా సురేఖ ఏమాత్రం మారలేదు. తరచూ వివాదాలలో ఉండే మంత్రి కొండా సురేఖ రాష్ట్రవ్యాప్తంగా తన గురించి చర్చ జరుగుతున్నా తన తీరు మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలతో విబేధాలు కొనసాగిస్తూ వస్తున్న కొండా సురేఖ తాజాగా మరో కాంట్రవర్సీ కి పాల్పడ్డారు. మంత్రిగా జిల్లాలోని నాయకులతో కలిసి నడవాల్సిన కొండ సురేఖ, అందరినీ కలుపుకుపోవలసిన కొండా సురేఖ ఐ డోంట్ కేర్ అంటూ తన పంధాను కొనసాగిస్తున్నారు.
ఇందిరాగాంధీ వర్ధంతి.. ఆమెకు కొండా సురేఖ షాక్
కొండా సురేఖ తీరుతో స్థానిక నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు.తాజాగా నేడు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశిబుగ్గ లోని ఇందిరా గాంధీ విగ్రహానికి ఎర్రబెల్లి స్వర్ణ పూలమాలవేసి నివాళులర్పించారు. ఇక అదే సమయంలో కొండ సురేఖ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి అక్కడకు రాగా మంత్రి అనుచరులు, కార్యకర్తలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలదండను తొలగించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఆపై మంత్రి కొండా సురేఖ పూల దండ వేసి ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపైన స్థానికంగా చర్చ జరుగుతుంది. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తొలగించి మళ్లీ కొండా సురేఖ తాను తెచ్చిన పూలమాలను ఇందిరా గాంధీ విగ్రహానికి వేయడం ఆమె ఏమాత్రం మారలేదు అన్న చర్చకు కారణంగా మారింది.
సురేఖనే కాదు ఆమె అనుచరులూ అంతే
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి పని చేయాల్సిన కొండా సురేఖ అందుకు భిన్నంగా చిన్న చిన్న విషయాలలో కూడా కయ్యానికి కాలు దువ్వడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక కొండా సురేఖ లానే కొండా సురేఖ అనుచరులు, కార్యకర్తలు, మిగతా నాయకుల పట్ల చూపిస్తున్న వైఖరి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు.
కొండా సురేఖపై నో యాక్షన్.. కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది
కాంగ్రెస్ పార్టీని గ్రూపులుగా విభజిస్తున్న కొండా సురేఖ, ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టెది ఒకదారి అన్న చందంగా ప్రవర్తిస్తున్నారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులలో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆమె తీరు పైన చర్యలు తీసుకోవాల్సిన అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బందిగా మారింది.
పంచాయితీలు లేవని చెప్తూనే కొండా గిల్లికజ్జాలు
పార్టీ శ్రేణులతో ఏమాత్రం సఖ్యత చూపించని కొండ సురేఖ తీరు తీవ్ర ఆక్షేపణీయం అని పలువురు సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎవరితోనూ పంచాయితీలు లేవని చెబుతూనే ప్రతి ఒక్కరితో పంచాయతీలు పెట్టుకుంటున్న కొండా సురేఖ తాజాగా చేసిన పని డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కు షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications