కేబినెట్ కు కొండా సురేఖ డుమ్మా వెనుక - కీలక పరిణామాలు...!?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ - మంత్రుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. సవాల్ చేసి వెళ్లకపోవటం పైన మంత్రి పైన తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. సురేఖ గైర్హాజరు సమాచారం ఇచ్చినా... అసలు కారణం వేరే ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లోనూ ఆసక్తి కరంగా మారుతోంది.

మంత్రి కొండా సురేఖ వ్యవహారం పై మరోసారి రాజకీయంగా చర్చ మొదలైంది. తాజా కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ తన విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటికీ, ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీకి రాకపోవడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయనే చర్చ కొనసాగుతోంది. ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వ్యవహారమే మంత్రి కొండా సురేఖ అసంతృప్తికి కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Minister Konda Surekha skips cabinet meeting leads to new political speculations in Congress leaders

తన శాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బోర్డు ఏర్పాటు విషయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన అభిప్రాయాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదనే భావనతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తీవ్ర అలక పూనిన కారణంగానే కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగానే కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 పురందేశ్వరి కీలక బాధ్యతలు, బండికి ప్రమోషన్- సమూల ప్రక్షాళన..కొత్త టీం సిద్దం..!!
పురందేశ్వరి కీలక బాధ్యతలు, బండికి ప్రమోషన్- సమూల ప్రక్షాళన..కొత్త టీం సిద్దం..!!

యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై

కాగా, ఆలయ బోర్డు ఏర్పాటు విషయం పై తన సన్నిహితుల వద్ద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దేవాదాయ శాఖ మంత్రినైన తనకు ఒక్కమాట కూడా చెప్పకుండానే నిర్ణయం తీసుకోవడంపై ఆమె మనస్తాపం చెందినట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డికి తోడుగా కొండా సురేఖ సైతం బోర్డు ఏర్పాటు విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం పైన రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+