చంద్రబాబు అరెస్ట్ వెనుక వాళ్లే , టీడీపీ ఛాన్స్ కోల్పోతోంది - మంత్రి కేటీఆర్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా టీడీపీ వర్సస్ వైసీపీ రాజకీయంగా పేర్కొన్న కేటీఆర్.. హైదరాబాద్ లో ధర్నాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికల్లొ అక్కడ సెటిలైన సీమాంధ్ర ఓటర్ల మద్దతు గురించి స్పష్టత ఇచ్చారు. సీఎం జగన్ తో పాటుగా టీడీపీ నేతలతో ఉన్న సంబంధాల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. తెలుగుదేశం కు కీలక సూచన చేసారు.

అరెస్ట్ వెనుక బీజేపీ:చంద్రబాబు అరెస్ట్ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని దేశం అంతా అనుకుంటున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చేయించింది ఏపీలోని ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్ ఏపీలో పరిణామాలు..తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం పైన స్పందించారు. చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేయటం సరికాదని తమ పార్టీకి చెందిన నేతలు సానుభూతి వ్యక్తం చేసారని కేటీఆర్ గుర్తు చేసారు. టీడీపీ నేతలు ఏపీలో రాజకీయ పోరాటం చేస్తున్నారని..ఇకే సమయంలో ఎంత మందితో గొడవ పెట్టుకుంటారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమ పైన సానుభూతితో ఉన్నవారిని వదిలేసుకుంటారా అని వ్యాఖ్యానించారు. తమకు టీడీపీలోని పలువురితో సత్సంబంధాలు ఉన్నాయని..సీఎం జగన్, పవన్, లోకేశ్ తోనూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు.

Minister KTR Alleged BJP Behind Chandra Babu Arrest, key comments on TDP Protests in Telangana

సానుభూతి కోల్పోవద్దు:చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ధర్నాలు చేస్తామంటే అనుమతి ఉండదన్నారు. ధర్నా చేయాలంటే ధర్నా చౌక్ లో చేసుకోవచ్చని..అభ్యంతరం ఉండదని స్పష్టం చేసారు. సైబర్ సిటీ, ఓఆర్ఆర్, మెట్రలో చేస్తామంటే సాధ్యంకాదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో బ్రాండ్..అక్కడ లా అండ్ ఆర్డర్ తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తామంటే పోలీసులు అనుమతి ఇవ్వరన్నారు. తాజాగా మెట్రలో నిరసన చేస్తున్న వారిని ఏపీకి చెందిన సహచర ప్రయాణీకులే నిలదీసారని కేటీఆర్ గుర్తు చేసారు.

చంద్రబాబుకు మద్దతుగా నిరసనలకు అనుమతి ఇస్తే..వైసీపీ మద్దతు దారులు నిరసనలకు దిగుతారని..ఇక్కడ ఏపీ పంచాయితీ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీలో తమకు ఎవరితోనూ ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం పై లోకేశ్ తాజాగా చేసిన ట్వీట్ పైన తాను స్పందించానని గుర్తు చేసారు.

Minister KTR Alleged BJP Behind Chandra Babu Arrest, key comments on TDP Protests in Telangana

వారంతా బీఆర్ఎస్ తోనే:సీమాంధ్ర నుంచి వచ్చిన సెటిలెర్లు తెలంగాణ ఎన్నికల్లో తమకు ఓటు వేయరనే అభిప్రాయం తప్పని కేటీఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు నుంచి వారిని సొంత బడ్డల్లా చూసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో అవకాశాలు లేక ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జరిగే నష్టం ఏంటో వాళ్లకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఎవరో ఏదో చెబితే ఓటర్లు తమను కాదని మరో పార్టీకి మద్దతుగా నిలచే పరిస్థితులు లేవని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు.

ఉద్యమం చేయాలంటే కేసులకు సిద్దపడాలని..తాము తెలంగాణ ఉద్యమం సమయంలో కేసులతో పాటుగా జైలుకు వెళ్లానని గుర్తు చేసారు. చంద్రబాబు వ్యవహారం పైన తాము సానుభూతితో ఉన్నామని.. అలాంటి వారిని టీడీపీ వదిలేసుకుంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. సానుభూతి పోగొట్టుకోవద్దని సూచించారు. ఇక, టీడీపీ ఇష్టమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+