బండి సంజయ్‌పై విరుచుకుపడ్డ అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత

హైదరాబాద్: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో సీఎం కేసీఆర్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అసభ్యకరంగా దూషించారని కేటీఆర్ మండిపడ్డారు.

ప్రధాని ఇంటి పేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపీ(రాహుల్ గాంధీ) సభ్యత్వాన్ని రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్‌ను నీచమైన భాషలో దూషించిన బండి సంజయ్‌ను తామేం చేయాలని.. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏం చేస్తారు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

minister KTR and MLC Kalvakuntla Kavitha hits out at BJP MPs Bandi Sanjay, Dharmapuri Arvind

మరోవైపు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదలకు ఫలితం వచ్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుందని పేర్కొన్నారు.

మరోవైపు, కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత కూడా బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు పోటీనే కాదని అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను వదిలిపెట్టేది లేదని.. ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్నారు కవిత.

ఎంపీగా పోటీ చేయకుండా కోరుట్లకు పారిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అరవింద్ చెప్పుకుంటున్నారని.. అయితే తాను మాత్రం ఎక్కడికీ పారిపోనని, నిజామాబాద్ ఎంపీ సీటు నుంచే పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ తన సొంత ఊరని.. తన అత్తగారి ఊరని, తాను బతికున్నంత కాలం.. తన కట్టెకాలుడు కూడా నిజామాబాద్‌లోనే ఉంటానన్నారు.

ఇక లోక్‌సభలో గురువారం బండి సంజయ్ దుర్మార్గమైన అబద్ధాలు చెప్పారని కవిత మండిపడ్డారు. 24 గంటలపాటు విద్యుత్ ఎక్కడ వస్తుందని ప్రశ్నించారని.. చేతనైతే బండి సంజయ్ కరెంటు తీగలు పట్టుకోవాలని సవాల్ విసిరారు. అప్పుడు కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందన్నారు. నిత్యం అబద్ధాలు మాట్లాడే బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటే కాంగ్రెస్, బీజేపీలకు భయమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+