మహిళలకు ఉమెన్స్ డే కానుక ఇదేనా? మోడీని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్!!

మహిళలకు ఉమెన్స్ డే కానుక ఇదేనా? అంటూ గ్యాస్ ధరల పెంపుపై మోడీ సర్కార్ ను టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. గ్యాస్ బండ బాదుడుపై మంత్రి కేటీఆర్ నిరసనలకు పిలుపునిచ్చారు.

దేశంలో గ్యాస్ ధరలను పెంపు చేస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్ష పార్టీలు అధికార బిజెపిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. నిన్నటి నుండి గ్యాస్ ధరలను వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ పై 350 రూపాయలు, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ పై 50 రూపాయల ధర పెరిగింది.

మోడీ ప్రభుత్వానికి కేటీఆర్ చురకలు

మోడీ ప్రభుత్వానికి కేటీఆర్ చురకలు


ఒకపక్క కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసన కార్యక్రమాలను నిర్వహించగా, తెలంగాణ రాష్ట్రంలోని అధికార బి ఆర్ ఎస్ పార్టీ మోడీ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంది. ఇక తాజాగా నిన్న పెరిగిన గ్యాస్ ధరలపై మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్ లో సోషల్ మీడియా వేదికగా మోడీ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. ఇదేనా డబల్ ఇంజన్ సర్కార్ అంటూ చురకలు అంటించారు.

నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్

నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్

గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా శుక్రవారం అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాలలో నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమెన్స్ డే రోజు దేశ మహిళలకు కానుకగా ప్రధాని మోడీ సిలిండర్ ధరలు పెంచారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచడం కేంద్రానికి అలవాటుగా మారిందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఎల్పిజి సిలిండర్ ధరలను విజయవంతంగా మూడు రెట్లు పెంచినందుకు డబుల్ ఇంజన్ ఎన్పీఏ ప్రభుత్వానికి అభినందనలు అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మోడీ సర్కార్ పై సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్

మోడీ సర్కార్ పై సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్

మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో ఎల్పిజి సిలిండర్ ధర 53% పెంచిందని, 2014 నుండి ఇప్పటివరకు అత్యధికంగా 169% ధర పెరిగిందని, ధనికులు మరింత ధనవంతులు అయ్యారని, వారి పన్నులు తగ్గాయని.. పేదలు మరింత పేదవారు అయ్యారని, వారి పన్నులు పెరిగాయని పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి చేసిన పోస్ట్ ను రీ ట్వీట్ చేసిన కేటీఆర్ ఈ మేరకు మోడీ సర్కార్ పై సెటైర్లు వేశారు.

 గ్యాస్ బండ బాదుడుపై మహిళలు, కాంగ్రెస్ నాయకుల ఆందోళన

గ్యాస్ బండ బాదుడుపై మహిళలు, కాంగ్రెస్ నాయకుల ఆందోళన


ఇదిలా ఉంటే గ్యాస్ బండ బాదుడుపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు తరచూ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నాయని, సామాన్యుల కష్టాలను అర్థం చేసుకోకుండా, వంటింట్లో మంట పెడుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు సిలిండర్ ధరల పెంపుపై బెంగళూరులో యూత్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఖాళీ సిలిండర్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన నిర్వహించి పెంచిన ధరలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+