వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలపై ఆర్టీసీ జీతాల భారం, ఏపీ బస్సులపై(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ విభజనలో ఎక్కడి ఆస్తులు అక్కడి వారికే చెందుతాయని, ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గురువారం చెప్పారు. ఆయన టీఎస్ఆర్టీసీ చిహ్నాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రయాణీకుల పైన భారం పడకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు.

ఈ నెల 28వ తేదీ నుండి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తాయని చెప్పారు. 28 నుండి పర్మిట్ పూర్తయి తెలంగాణకు వచ్చే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులపై ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పారు.

 టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

రాష్ట్ర రహదారి రవాణా సంస్థ విభఝనలో ఎక్కడి ఆస్తులు అక్కడి వారికే చెందుతాయన్నారు. ఎవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ నెల 25న బోర్డు సమావేశం తర్వాత 28వ తేదీన ఆర్టీసీ విభజన పూర్తవుతుందన్నారు.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

అలాగే అనుమతి పూర్తయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు కూడా ఇతర రాష్ట్రాల బస్సుల మాదిరిగా ప్రవేశ రుసుము తెలంగాణలో వసూలు చేస్తామని చెప్పారు.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

ఆర్టీసీలో పెంచిన జీతాలు, డీజిల్ ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులపై పెద్దగా భారం పడకుండా ఛార్జీలు పెంచే కసరత్తు చేస్తున్నామన్నారు.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

కొత్త లోగోను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. ఈ చిహ్నంతో కొత్త సంస్థకు నాంది పలుకుతున్నామన్నారు. చిహ్నంలోని బంగారు రంగు వృత్తం బంగారు తెలంగాణకు నిదర్శనమని, ఆకుపచ్చని రంగు హరిత హారాన్ని చాటుతుందని, కాకతీయ తోరణం తెలంగాణను ప్రతిబింబిస్తే, చార్మినార్ తెలంగాణలోని పట్టణాలకు ప్రతీక అన్నారు.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

రాష్ట్రంలోని ప్రతి పల్లెకు బస్సు ఉంటుందన్నారు. అలాగే రాష్ట్ర రాజధానిని కలుపుతూ అన్ని పట్టణాల నుండి అరవై రాజధాని ఏసీ(ఇంద్ర) బస్సులను నడపనున్నట్లు చెప్పారు. రూ.10 కోట్లతో పది అత్యాధునిక గరుడ ప్లస్ వోల్వో ఏసీ బస్సులు ఈ నెలాఖరులోగా ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నామన్నారు.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ


మొత్తం మీద రూ.150 కోట్లతో 500 బస్సులను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో నాలుగు వందల బస్సులు పల్లె వెలుగులు అన్నారు.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

కాగా, ముదురు ఆకుపచ్చ, తెలుపు రంగుతో కనిపించే పల్లె వెలుగు బస్సులు.. ఇప్పుడు చిగురు ఆకుపచ్చ రంగుకు మారుతున్నాయి.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లోగో రూపకర్త వనం జ్ఞానేశ్వర్‌ను మంత్రి మహేందర్ రెడ్డి సన్మానించారు. మెట్రో రైలు, ఉమ్మడి ఏపీ స్వర్ణోత్సవ లోగోలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రచార చిత్రాలు, జ్ఞాపికలను రూపొందించిన జ్ఞానేశ్వర్‌కు ఈ సందర్భంగా రూ.10వేల నగదు బహుమతి అందించారు. సీఎం కేసీఆర్ కూడా ఈ లోగోకు ఆమోద ముద్ర వేశారని చెప్పారు.

English summary
Minister Mahender Reddy Inauguration of TSRTC logo at Bus Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X