ఒడిలో వృద్దురాలితో.. విచిత్ర విన్యాసాలు మొదలెట్టిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నికల సమయంలో నేతలు చేసే షాకింగ్ ప్రచారం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎన్నికలలోను ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఓటర్ల మద్దతును పొందడం కోసం వారి వద్దకు వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటారు.
అయితే ఓటర్లు మద్దతును పొందడం కోసం తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసే విన్యాసాలు మాత్రం వర్ణనాతీతం అనే చెప్పాలి. పాలమ్మిన.. పూలమ్మిన అంటూ తనదైన శైలిలో డైలాగులతో ఆకట్టుకున్న మంత్రి మల్లారెడ్డి, తాజాగా వినూత్నంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా తిరుగుతున్న మంత్రి మల్లారెడ్డి ఓ వృద్ధురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు .

ఇప్పుడు మల్లారెడ్డి వృద్ధురాలిని ఒడిలో కూర్చోబెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన మహిళలు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో మహిళలు అంత కింద కూర్చుని ఉండగా మల్లారెడ్డి సైతం వారితోనే కింద కూర్చున్నారు.
తెలంగాణకు, కెసిఆర్ కు అనుకూలంగా నినాదాలు చేసిన మంత్రి మల్లారెడ్డి ఒక వృద్ధురాలిని ముందుకు రమ్మని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోటోకు ఫోజులిచ్చారు. ఒక మంత్రి మల్లారెడ్డి చేసిన పని చూసిన అక్కడ వారంతా షాక్ అవ్వటం తో పాటు బాగా నవ్వుకున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డి చర్య పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
ఓట్ల కోసం మరీ ఇంతలా వృద్ధురాలిని మంత్రి మల్లారెడ్డి ఇబ్బంది పెడతాడా అంటూ పలువురు కామెంట్ చేస్తుంటే, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో చదువుకునే విద్యార్థులు భవిష్యత్ రాజకీయాలలో ఓట్ల కోసం ఏం చేయాలో మల్లారెడ్డి ని చూసి నేర్చుకోవాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి మంత్రి మల్లారెడ్డి అప్పుడే ఎన్నికల విన్యాసాలు మొదలెట్టేశారు. ముందు ముందు మరెంత హంగామా చేస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications