Pongulati: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదు..!

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం జరుగుతుందని.. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పెట్టుబడులన్నీ అక్కడి తరలిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. అక్కడి వచ్చే పెట్టుబడులు అక్కడి వస్తాయి.. తెలంగాణ వచ్చే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని పేర్కొన్నారు.

అమరావతిలో వరదల వల్ల పెట్టుబడిదారులు ఆలోచన చేస్తున్నారని గుర్తు చేశారు. పెట్టుబడులు తెలంగాణ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఇక హైడ్రాపై కూడా చాలా మంది తప్పుడు ప్రచారం చేశారు. హైడ్రా భయం ప్రజల్లో తగ్గిందన్నారు. పేదవారి ఇళ్లను హైడ్రా ముట్టుకోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ రుణాలతో కలిపి మొత్తం లెక్కలు గులాబీ నేతలు చెప్పాలన్నారు.

Minister Ponguleti Srinivas Reddy says that real estate has not fallen in Telangana

కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయని కేటీఆర్ కు తెలియకపోవడం ఆయన అమాయకత్వానికే నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 7 లక్షల 20 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే తీసుకున్నారని పొంగులేటి గుర్తు చేశారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడంపై పొంగులేటి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాట్లాడాలని ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌ లో ఆదాయం పెరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి లేదని.. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. వైఎస్ఆర్ సమయంలో కూడా ఇలానే ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+