రాష్ట్రంలో అప్రకటిత కరెంట్ కోతలు ఎక్కడున్నాయో చూపించండి!

తెలంగాణ రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కరెంటు పోయేది చెప్పలేమని అందుకే బీఆర్ఎస్ సభకు 200 జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు ఉన్నాయని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేతలు మండిపడుతున్నారు.

రాష్ట్రంలో అప్రకటిత కరెంట్ కోతలు లేవు
రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు లేవని, నిన్న బీఆర్ఎస్ చేసిందంతా తప్పుడు ప్రచారం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు . నేడు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లో 33/11 విద్యుత్ ఉపకేంద్రానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, NPDCL సిఎండి వరుణ్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Minister ponnam prabhakar slams brs to Show where unannounced power cuts in the state

Take a Poll

రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తున్నాం
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ 2.14 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. దీనిద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన విద్యుత్ అందుతుందన్నారు.విద్యుత్ శాఖ కి సంబంధించిన సమీక్షలలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, ఎక్కడ విద్యుత్ ఇబ్బందులు ఉండకూడదని అధికారుల సాంకేతిక అవసరాలు కూడా తెలుసుకుని తీర్చామన్నారు.

రాజకీయ విమర్శల్లో విద్యుత్ పై అవాస్తవాలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ లేక ఎక్కడా రైతులు ఇబ్బంది పడలేదని అన్నారు. అప్రకటిత కరెంట్ పోకుండా కూడా చర్యలు తీసుకున్నామని,గతంలో ఒక అధికారి పవర్ కట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిసిన వెంటనే సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. రాజకీయ విమర్శల్లో అవాస్తవాలు ప్రచార చేస్తే సరికాదని ఆయన అన్నారు. కావాలని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రైతాంగానికి మేలు చేస్తుంది కాంగ్రెస్
తాము రైతాంగానికి మేలు చేస్తున్నామని, గతం లో ధాన్యం కొనుగోలు తాలు పేరుతో కటింగ్ ఉండేది..ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుంటే రైతులకు నష్టం చేస్తున్నామని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. కేవలం రాజకీయాల కోసమే నిన్న తప్పుడు ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+