Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేడారం జాతర ఫెయిల్యూర్.. ఇదంతా కుట్ర!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఆయన మేడారం జాతరను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెడితే, మేడారం జాతరలో ట్రాఫిక్ సమస్యలు, బస్సులు, మౌలిక సదుపాయాల సమస్యలతో జాతర ఫెయిల్ అయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో మంత్రి సీతక్క దీనిపైన స్పందించారు.

మేడారం జాతరను దెబ్బ తీయాలనే కుట్రలు: మంత్రి సీతక్క

జాతర ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలు సహించమని మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొంతమంది రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మేడారం జాతర నిర్వహణలో భాగంగా వారం రోజుల పాటు తాము 24 గంటలూ అక్కడే ఉండి పనిచేశామన్నారు.

minister seethakka said that opposition created conspiracies on medaram jathara made false publicity

గుడి నిర్మాణం ప్రారంభం అయిన నాటినుండే తప్పుడు ప్రచారం

కోట్లాది మంది భక్తులు సుఖశాంతులతో దర్శనం చేసుకున్నారని తెలిపారు. జాతరను సక్సెస్ చేయడంలో సహకరించిన ములుగు జిల్లా మీడియా సోదరులకు, అధికారులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గుడి నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచే ఆదివాసీ విశ్వాసాలకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. గుడిలో చేసిన ప్రతి మార్పు పూజారుల ఆమోదం, ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే జరిగిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

మాస్‌తో పాటు క్లాస్, సూపర్ క్లాస్ భక్తులు

అయినప్పటికీ సమ్మక్క గద్దెల వద్ద కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈసారి మాస్‌తో పాటు క్లాస్, సూపర్ క్లాస్ భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం కొందరికి జీర్ణించుకోలేక నెగటివ్ నరేటివ్‌ను సృష్టిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సాయంత్రం విఐపి వాహనాలు భారీగా రావడంతో కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడిందని, అది బస్సులు లేకపోవడం వల్ల కాదని తెలిపారు.

విఐపిలు వందలాది మంది రావటంతోనే ట్రాఫిక్

గత జాతరలతో పోలిస్తే ఈసారి ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గాయని పేర్కొన్నారు. కొంతమంది విఐపిలు వందలాది మందితో, అనేక వాహనాలతో రావడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. జాతరలో 13 వేల మంది పోలీసులు, 40 రోజుల పాటు జిల్లా యంత్రాంగం సేవలందించిందని తెలిపారు. తాగునీటి ట్యాంకులు, చలివేంద్రాలు, టాయిలెట్లు, షెడ్లు, తల్లులు,పిల్లల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామన్నారు.

మేడారం జాతరపై ప్రచారం తప్పు

చిన్నచిన్న లోపాలు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని తెలిపారు. వ్యక్తిగత భూముల్లో జరిగిన చిన్న వ్యాపారాలను కూడా దందాలుగా చిత్రీకరించారన్నారు. ఇదంతా కుట్రపూరితమని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమాలు చేస్తే తామే బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు. జాతరలో ప్రమాదాలు జరుగుతాయని, ప్రాణనష్టం జరుగుతుందని యూట్యూబ్‌లు, టీవీ ఛానళ్లలో చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు.

దేవతలను, జాతరను కించపరచడం సహించబోం

రాజకీయాలపై మాట్లాడితే మాట్లాడొచ్చుగానీ, దేవతలను, జాతరను కించపరచడం సహించబోమన్నారు. సమ్మక్క-సారలమ్మలు అన్ని కులాలు, అన్ని మతాలు నమ్మే ప్రకృతి దేవతలని, వారి కీర్తిని తగ్గించే కుట్రలను తక్షణమే మానుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే తమ బాధ్యతని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+