కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన - వీరికి మంజూరు, పంపిణీ ముహూర్తం..!!

కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు ఫించన్ల కోసం దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే, లబ్ది దారుల నుంచి వస్తున్న అభ్యర్ధనల మేరకు ఈ గడువు పొడిగించాలని నిర్ణయించారు. దీంతో అర్హత ఉండి పింఛన్లు పొందాలనుకునేవారు వెంట నే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అర్హులైనవారికి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు.

తెలంగాణలో కొత్త 'చేయూత' పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మొదట నిర్ణయించిన ఆఖరి తేదీ ఆగస్టు 31 (ఈరోజే) కావడంతో చాలా మంది లబ్ధిదారులు ఆందోళనతో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ నేపథ్యం లో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 సెప్టెంబర్ 1 పెన్షన్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన - కొత్తగా వీరికీ పంపిణీ..!!
సెప్టెంబర్ 1 పెన్షన్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన - కొత్తగా వీరికీ పంపిణీ..!!
Minister Seethakka says cheyutha pensions application date extended to help the beneficiaries

కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అర్హులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. కాగా, ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మంది సామాజిక పింఛన్లను కొత్తగా అందించాలని ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 విదేశాల్లో విద్యకు ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ - దరఖాస్తులు, అర్హతలు..!!
విదేశాల్లో విద్యకు ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ - దరఖాస్తులు, అర్హతలు..!!

ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజుతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. దాదాపుగా 4.50 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేపు (మంగళ వారం) నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో వితంతువులు అత్యధికంగా 2,64,815 మంది ఉండగా.. ఒంటరి మహిళలు 26,057 మంది ఉన్నారు. ఇక దివ్యాంగులు 1,07,171 మంది దరఖాస్తు చేసుకోగా.. గీత కార్మికులు 26,343, చేనేత కార్మికులు 10,468 మంది ఉన్నారు. ప్రభుత్వం పెట్టుకున్న 2.50 లక్షల లక్ష్యం కంటే దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. లబ్దిదారుల జాబితా సిద్దం చేసిన అనంతరం కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే పించన్లను జమ చేయాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+