ఘనంగా ఆత్మీయ సమ్మేళనాలు.!25న ఊరూ వాడా ఉత్సాహంగా నిర్వహించాలన్న మంత్రి తలసాని.!

హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీన అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్ లో హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లా ఇంచార్జి దాసోజు శ్రవణ్ కలిసి హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

 chalasani

ఘనంగా ఆత్మీయ సమమ్మేళనాలు..
హైదరాబాద్ నగరంలో కూడా అనేక నియోజకవర్గాలలో డివిజన్ స్థాయి సమ్మేళనాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన డివిజన్ ల లో కూడా ఈ నెల 24 వ తేదీ లోగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

25 వ తేదీన నిర్వహించే నియోజకవర్గ సమ్మేళనాలకు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, కార్పొరేటర్ లుగా పోటీ చేసిన వారిని, డివిజన్ పార్టీ అద్యక్షులు, ముఖ్య నాయకులను ఆహ్వానించాలని వివరించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి సమావేశం వద్దకు రావాలని చెప్పారు. సమ్మేళనాల సందర్బంగా జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని తలసాని అన్నారు.

 chalasani

సమగ్రమైన ఎజెండాను సిద్దం చేసుకోవాలి..
సమావేశం నిర్వహణ కు సంబంధించి సమగ్రమైన ఎజెండాను సిద్దం చేసుకోవాలని మంత్రి తలసాని తెలిపారు. ఆయా నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి పనులను తెలియజెప్పే విధంగా నియోజకవర్గ ప్రగతి నివేదికను రూపొందించి ఆత్మీయ సమ్మేళనంలో వివరించాలని చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కార్పోరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, రావుల శ్రీధర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

 chalasani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+