జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. పూర్తి వివరాలు ఇవే..
'మినీ తిరుమల' గా పిలిచే జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈ మేరకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికను శనివారం జూబ్లీహిల్స్ లోని స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
'మినీ తిరుమల' గా పేరుగాంచిన జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని TTD నిర్మించింది. ఈ ఆలయం తిరుమల శ్రీవారిని పోలి ఉండటంతో దీనిని మినీ తిరుమల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం వేంకటేశ్వర స్వామితో పాటు, మహా గణపతి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఆండాళ్ అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
అయితే ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభగంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.
ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. ఇక వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 17.. ఉదయం ధ్వజారోహణం మేష లగ్నంలో ఉ. 10.30 నుంచి 11.00 గంటల వరకు ఉంటుంది. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామి దర్శనం ఇస్తారు.
ఫిబ్రవరి 18న ఉదయం చిన్నశేష వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. రాత్రి హంస వాహన సేవ ఉంటుంది. 19న ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే రాత్రికి ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తారు. 20న ఉదయం కల్పవృక్ష వాహనంపై.. అలాగే రాత్రి సర్వభూపాల వాహనం సేవ చేస్తారు.

ఇక 21న ఉదయం పల్లకీ ఉత్సవం.. రాత్రి గరుడ వాహన సేవ ఉంటుంది. 22న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం సేవలు జరుగుతాయి. ఫిబ్రవరి 23 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. ఇక 24 ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం సేవలు ఉంటాయి. 25 న ఉదయం చక్రస్నానం.. రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఇక చివరగా 26న మధ్యాహ్నం 3 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications