'పబ్'మాయ: టెన్త్ లోనే కాక్ టెయిల్, వాళ్లకూ పాకుతోంది!, విస్తుపోయే నిజాలు?

Subscribe to Oneindia Telugu
  Minors attracting to pub culture, Why ? 'పబ్'మాయ: టెన్త్ లోనే కాక్ టెయిల్,వాళ్లకూ పాకుతోంది|Oneindia

  హైదరాబాద్: స్లో పాయిజన్‌లా నగరంలో పబ్ కల్చర్ మెల్లిమెల్లిగా అన్ని వర్గాలకు విస్తరిస్తోంది. తొలుత సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ కల్చర్.. రాను రాను మిడిల్ క్లాస్‌ను కూడా టార్గెట్ చేసింది. అందునా.. మైనర్లయిన టీనేజర్లు సైతం పబ్ కల్చర్‌లో మునిగితేలుతుండటం ఆందోళనపరుస్తోన్న విషయం.

  పదో తరగతిలోనే కాక్ టెయిల్ రుచిమరిగి.. మత్తులో చిత్తయిపోతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. డబ్బే ప్రధానంగా నిబంధనలకు తిలోదాకాలిస్తున్న పబ్‌లు దీన్ని పెంచి పోషిస్తున్నాయి. దీంతో బర్త్ డేలు, గెట్ టు గెదర్‌లు, ఇలా సందర్భమేదైనా మైనర్లు పబ్‌నే తమ అడ్డాగా మార్చుకుంటున్నారు.

  నకిలీ ఐడీలు:

  నకిలీ ఐడీలు:

  నిజానికి పబ్‌లలో మైనర్లను అనుమతించినప్పటికీ.. తెలివిమీరిన టీనేజర్లు నకిలీ ఐడీలతో లోపలికి వెళ్తున్నారు. అంతేకాదు, తమ తల్లిదండ్రులే అభ్యంతరం చెప్పనప్పుడు మీకెందుకు బాధ అంటూ తమతో గొడవపడేవారని ఓ పబ్ నిర్వాహకుడు పేర్కొనడం గమనార్హం.

  అంతేకాదు, 15 ఏళ్ల టీనేజర్‌కే మీసాలు, గడ్డాలు ఉంటున్నాయని, అలాంటివాళ్లను మేజర్ కాదంటే ఎలా నమ్మగలం అని వారు ప్రశ్నిస్తుండటం గమనార్హం. నేను మేజర్‌ అంటే కాదని మేంబిజినెస్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించామని, కానీ బిజినెస్ డల్ అవడం, తమను అనుమతించాలని మైనర్ల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండటంతో అనుమతించక తప్పడం లేదని చెప్పుకొచ్చాడు.

  అదో స్టేటస్ సింబల్:

  అదో స్టేటస్ సింబల్:

  పబ్ కల్చర్ అనేది ఈరోజుల్లో స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. పబ్ అలవాటు లేనివాళ్లను స్నేహితులంతా ఏదో తప్పుచేసినవాడిలా చూస్తుండటంతో.. మిడిల్ క్లాస్ పిల్లలు సైతం ఆ ఊబిలో దిగుతున్నారు. అలా పదో తరగతిలోనే మత్తులో చిత్తయిపోతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దీనికి తోడు సంపన్న వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ద పెట్టకపోవడం కూడా వారిని గాడి తప్పేలా చేస్తోంది. తాగొచ్చాడని తెలిసినా.. కనీసం మందలించకపోవడం, రాత్రంతా ఇంటికి రాకపోయినా ఏమి అనకపోవడంతో వారికి అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు.

  పబ్‌లలొ ప్రత్యేక ఏర్పాట్లు:

  పబ్‌లలొ ప్రత్యేక ఏర్పాట్లు:

  తప్పతాగి చిత్తుగా చిందేస్తూ ఎంజాయ్ చేసే మైనర్ల కోసం పబ్ లు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఒకవేళ వారు సోయి తప్పి పడిపోతే.. అక్కడినుంచి పంపించాల్సింది పోయి అక్కడే బస ఏర్పాట్లు చేస్తున్నాయి. వయోపరిమితి మీద నిబంధనలు ఉన్నప్పటికీ.. వారి బిజినెసే ముఖ్యంగా మారింది. నిజానికి మైనర్లు వెళ్లే పబ్ పార్టీలు పైకి మాత్రం నాన్ ఆల్కాహాలిక్ గా కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం మద్యం కలిపిని డ్రింక్‌లే సప్లై అవుతుంటాయి. జూబ్లీహిల్స్ లోని రెండు పబ్ లు ఇదే పనిచేస్తున్నాయని ఇటీవల అధికారులు గుర్తించారు.

  పబ్ వల:

  పబ్ వల:

  మైనర్ కస్టమర్స్ ఎక్కువగా ఉండటంతో వారిని ఆకట్టుకోవడం కోసం పబ్‌లు ప్రత్యేక ప్యాకేజీలను కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ మెసేజ్‌లతో వారికి పార్టీలు, ప్యాకేజీల సమాచారాన్ని అందిస్తుంటాయి. తక్కువ ధరకే బర్త్ డే పార్టీలు, ఇతరత్రా ఆఫర్ చేస్తామని మెసేజ్ లు పంపిస్తుండటతో.. చాలామంది పబ్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల ఓ పదోతరగతి విద్యార్థి ఫోన్‌ను పరిశీలించినప్పుడు పోలీసులకు ఈ నిజాలు తెలిశాయి. ఫోన్ లో పబ్ నిర్వాహకుల మెసేజ్ ల గురించి ఆమెను ప్రశ్నించగా.. బర్త్ డే పార్టీల కోసం పబ్ కు వెళ్తుంటానని సమాధానం చెప్పాడు.

  బ్రీజర్ మిక్స్ , కాక్ టెయిల్:

  బ్రీజర్ మిక్స్ , కాక్ టెయిల్:

  తాను ఇప్పటివరకు 20-30సార్లు ఆ పబ్‌కు వెళ్లినట్లు సదరు విద్యార్థి అంగీకరించాడు. క్లాస్ మేట్స్ అంతా కలిసి వెళ్తామని, బ్రీజర్ కలిపిన వెల్ కమ్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటామని చెప్పాడు. ఒకవేళ స్ట్రాంగ్ కావాలంటే మాత్రం కాక్ టెయిల్ ఆర్డర్ చేస్తామని చెప్పాడు. శనివారం రాత్రి ఎక్కువగా ఈ పార్టీలు జరుగుతుంటాయని చెప్పాడు. రాత్రి తాగింది ఎక్కువైతే ఆదివారమంతా రెస్ట్ తీసుకుని సోమవారం స్కూల్ కు వెళ్తామని చెప్పుకొచ్చాడు.

  శుక్రవారం నుంచే హంగామా:

  శుక్రవారం నుంచే హంగామా:

  శనివారం పార్టీకి శుక్రవారం నుంచే హడావుడి మొదలవుతుందని ఆ విద్యార్థి పోలీసులతో చెప్పాడు. ఏ పబ్ కు వెళ్లాలి? ప్లాన్ ఏంటీ? వంటి విషయాలను శుక్రవారమే చర్చిస్తామన్నాడు.ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల వారిలో కొందరు తమ పిల్లలను పట్టించుకోకపోవడం వల్లే మైనర్లు గాడి తప్పుతున్నారని పోలీసులు అంటున్నారు. సంపాదిస్తున్నాం కదా అని పిల్లలను ఇష్టమొచ్చినట్లు వదిలేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గుర్తెరగాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  At the age of 16 somany minors are tasting cocktail in pubs. Especially high profile family children are easily attracting to pub culture

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి