కూల్.. కూల్ అంటేనే ఇంత వరకూ వచ్చింది- దానం కీలక వ్యాఖ్యలు..!!

ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. దానం అనర్హత వ్యవహారం పైన ఈ రోజు హైకోర్టు తీర్పు రానుంది. ఈ సమయంలోనే అసెంబ్లీలో దానం ప్రస్తావించిన అంశాలు.. చేసిన వ్యాఖ్యలు ఆసక్తి గా మారాయి. తాను ఫైటర్ అని.. నిర్ణయం ఎలా ఉన్నా తాను సిద్దమేనని దానం స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమను పట్టించుకోవటం లేదని వాపోయారు. ఎంఐఎం ఎమ్మెల్యేలంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.

అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. ఇందిరమ్మ ఇళ్ల గురించి దానం ప్రస్తావించారు. తాను అడిగితే మంత్రి కూల్.. కూల్ అంటారని.. అదే ఇప్పుడు ఈ పరిస్థితి వరకు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తమ నియోజక వర్గానికి కేటాయించిన ఇళ్ల విషయంలో సమస్య ఉందని చెప్పారు. తమ నియోజకవర్గానికి ఇళ్లు కేటాయించారని... హైదరాబాద్ సిటీలో ఉన్న 15 నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమస్యగా దానం చెప్పుకొచ్చారు. ఇళ్లు డ్రా చేసే సమయంలో ఎమ్మెల్యేలందరికీ ఈ సమస్య ఎదురైందని.. తన నియోజక వర్గంలో ఇతర నియోజకవర్గాల వారికి ఇళ్లు వచ్చాయని వివరించారు. మలక్‌పేటకు చెందిన వారికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇళ్లు కేటాయించారన్నారు. ఇళ్ల కేటాయింపుల్లో నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కొత్త వివాదంలో ఆరా మస్తాన్‌- పోలీసు కేసు, నోటీసులు..!!
కొత్త వివాదంలో ఆరా మస్తాన్‌- పోలీసు కేసు, నోటీసులు..!!
mla-danam-nagendar-raised-key-issues-over-allotment-of-indiramma-houses-for-poor-in-hyderabad

అసెంబ్లీలో దానం వ్యాఖ్యలతో

తాను ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాల్సి ఉన్నా..ఇప్పటివరకు రిఫర్ చేయలేదని దానం చెప్పారు. తమ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలని కోరారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన వారైనా వారి నియోజకవర్గంలోనే వారికి ఇళ్లు రావాలని..ప్రతినిధులందరికీ సమాన గౌరవం ఉండాలని కోరారు. అధికారులు ప్రజాప్రతినిధులను చూసి భయపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రతీ ఎమ్మెల్యే కు తన ప్రజల కోసం పోరాడే హక్కు ఉందన్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించిన ఇళ్లపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేసారు. మొత్తం వ్యవహారంపై 360 డిగ్రీల స్క్రూటినీ జరిగిందని అధికారులు చెబుతున్నారని.. అయినా తప్పు జరిగిందని.. దీనికి కారకులైన అధికారు ల పైన చర్యలు తీసుకోవాలని దానం డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+