ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్.. బీజేపీ, బండి సంజయ్ టార్గెట్ వెనుక రీజన్ చెప్పిన రఘునందన్

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార పార్టీ పై ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో ప్రధానంగా బిజెపిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ నన్ను జైలుకు పంపుతావా.. అంత బలుపా .. అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మెడలు వంచటం కాదు మీ మెడలు విరుస్తామంటూ కేసీఆర్ తీవ్ర పదజాలంతో బిజెపి పై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ చాలా రోజుల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారని తన స్థాయికి తగిన వాడు కాదని వదిలేశానని పేర్కొన్న కేసీఆర్ ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అనుకున్నానని పేర్కొన్నారు. ఇక ఇలాగే డ్రామాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. తానే రంగంలోకి దిగుతానని కెసిఆర్ స్పష్టం చేశారు.

 సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన రఘునందన్ రావు

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన రఘునందన్ రావు

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ తెలంగాణ రథసారథి బండి సంజయ్ పై, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమేనంటూ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ కు ఏడేళ్ళలో ఎప్పుడు కోపం వచ్చినా, ఆవేదన వచ్చినా ప్రజల అటెన్షన్ ను మార్చడం కోసం బీజేపీని తిట్టడం ఫ్యాషన్ గా మార్చుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు

హుజురాబాద్ ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో కెసిఆర్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు అర్థమవుతోందని తాజాగా ఆయన వ్యాఖ్యల ద్వారా ఈ విషయం అందరికీ తెలిసిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
బిజెపిని ఎదుర్కోవడం కష్టమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిందని పేర్కొన్న రఘునందన్ రావు అందుకే సీఎం కేసీఆర్ అలా ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ బిజెపి వరి వద్దని అందని, తెలంగాణలోని సిల్లీ బిజెపి వరి వెయ్యమని చెబుతోందని చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. కేంద్రం ఎక్కడా వరి ధాన్యం కొనమని చెప్పలేదని, కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని చెప్పారని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

 ఢిల్లీలో అలా... తెలంగాణా రాష్ట్రంలో ఇలా కేసీఆర్ తీరు

ఢిల్లీలో అలా... తెలంగాణా రాష్ట్రంలో ఇలా కేసీఆర్ తీరు

కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రఘునందన్ రావు మండిపడ్డారు. నచ్చితే ఓ రకంగా నచ్చకపోతే ఇంకో రకంగా మాట్లాడడం సరికాదని సీఎం కేసీఆర్ కు హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తే అడగాలని, నిలదీయాలని, అప్పుడు తాము కూడా దానిని స్వాగతిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు పనులు చేసుకోవడం, తెలంగాణలో మాత్రం తమతో గొడవ పెట్టుకోవడం సరికాదని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అన్న రఘునందన్ రావు

తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అన్న రఘునందన్ రావు

ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తానూ చేసుకు పోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పేర్కొన్నారు రఘునందన్ రావు, చాలా మంది ముఖ్యమంత్రులు తప్పు చేసినప్పుడు అరెస్టయ్యారు అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అందుకు అతీతం ఏమీ కాదని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే కేంద్ర అరెస్టు చేస్తుందని మాత్రమే బండి సంజయ్ చెప్పారని పేర్కొన్నారు రఘునందన్ రావు. అయితే పెట్రోల్ డీజిల్ ధరల పై చాలా రాష్ట్రాలు ధరలు తగ్గించినప్పుడు, మీరు ఎందుకు తగ్గించారు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు.

 బీజేపీ మీటింగ్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ

బీజేపీ మీటింగ్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ

పెంచిన ధరలలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదా అంటూ ప్రశ్నించిన రఘునందన్ రావు, సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికల ఓటమి ఆవేదనలో, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారంటూ తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+