కవిత సహనానికి పరీక్ష.. ఈడీపై సుప్రీం ఆగ్రహం.. ఏం జరిగిందంటే!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ మరోమారు వాయిదా పడింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది. బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు నిరాశే ఎదురవుతుంది. కవిత బెయిల్ కోసం సుదీర్ఘ నిరీక్షణ చేయాల్సి వస్తోంది.
ఈడీపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
ఈరోజు జస్టిస్ కె వి విశ్వనాథన్, జస్టిస్ గవాయ్ తో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే కవిత మద్యంతర బెయిల్ పిటిషన్ పైన ఈడి కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ కవిత బెయిల్ పిటిషన్ పైన ఈడి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

కౌంటర్ దాఖలు ఆలస్యం దేనికి? ప్రశ్నించిన ధర్మాసనం
ఈనెల 27వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కవిత తరపు న్యాయవాది ఆగస్టు 23వ తేదీలోపు రిజాయిండర్ దాఖలు చేయాలని సూచన చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేయడానికి ఆలస్యం ఎందుకు జరుగుతుందని ఈడిని కోర్టు ప్రశ్నించింది.
కవిత తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ
ఇక కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపిస్తూ కవిత బెయిల్ పొందేందుకు అన్ని విధాలుగా అర్హత ఉన్న మహిళ అని పేర్కొన్నారు. ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఆగస్ట్ 27వ తేదీకి కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
అంతేకాదు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణ పూర్తయిందని ఈ కేసులో చార్జిషీట్ కూడా ఫైల్ చేసిన కారణంగా బెయిల్ మంజూరు చేయాలని ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈనెల 27వ తేదీకి కవిత మభ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications