కేసీఆర్ ఊసరవెల్లి: మణిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

ఏపీ, తెలంగాణ విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. నాటి నుండి తెలంగాణ విషయంలో అధికార టీఆర్ఎస్,బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సందట్లో సడేమియా అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తుంది.

కేసీఆర్ ఊసరవెల్లి అంటూ మణిక్కం ఠాకూర్ పోస్ట్

తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మణిక్కం ఠాకూర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఊసరవెల్లి అంటూ ట్వీట్ చేసారు. అంతే కాదు ఊసరవెల్లి స్పెషాలిటీ అంటూ రంగులు మార్చే ఊసరవెల్లి ఫోటోను కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మణిక్కం ఠాకూర్ పోస్ట్ చేశారు. అంతకుముందు ఆయన చేసిన మరో పోస్ట్ లో తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ టీం కోట్లాదిమంది తెలంగాణ యువత, సోనియమ్మ కోరుకున్న తెలంగాణ కోసం పని చేస్తూనే ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఏడేళ్ళలో సోనియా కోరుకున్న తెలంగాణా సిద్ధించలేదు

కానీ ఏడేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సోనియాగాంధీ కోరుకున్న తెలంగాణ సిద్ధించ లేదని పేర్కొన్న మణిక్కం ఠాకూర్ అది నెరవేరాలంటే ఊసరవెల్లి టిఆర్ఎస్ ను, మతతత్వ బిజెపి ని ఓడించాలని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాల లాంటివని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయగలదని ట్వీట్ చేశారు. ఇక మణిక్కం ఠాకూర్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఊసరవెల్లి కేసీఆర్ కు ఒక రోల్ మోడల్ అని, కెసిఆర్ ను ఎప్పటికీ నమ్మొద్దు అంటూ ట్వీట్ చేశారు.

మణిక్కం ఠాకూర్ పోస్ట్ కు కవిత కౌంటర్

కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మణిక్కం ఠాకూర్ చేసిన పోస్టుకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదని పేర్కొన్న కవిత కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మణిక్కం ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

తెలంగాణా రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం

అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడంతోనే తెలంగాణ ఇచ్చారని అది ఎవరో ఇచ్చిన గిఫ్ట్ కాదని, ఎవరి దయా దాక్షిణ్యాలు అసలే కాదని , పోరాడి సాధించుకున్నామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాడు ప్రజా పోరాటంలో ఆఖరికి సత్యమే గెలిచిందని కవిత వెల్లడించారు.

రాహుల్ కు అండగా కేసీఆర్ .. అది ఆయన గొప్పతనం

రాహుల్ కు అండగా కేసీఆర్ .. అది ఆయన గొప్పతనం

భారత దేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కి అండగా నిలబడ్డారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అది కెసిఆర్ స్థాయి, ఆయన గొప్పతనం అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇంకోసారి కెసిఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ కవిత మణిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+