బిగ్ షాక్ ఇచ్చిన కవిత.. ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవం..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బిఫోర్ అరెస్ట్.. ఆఫ్టర్ అరెస్ట్ అన్నట్టు మారింది కవిత వైఖరి. ముందుగా లేఖల లీక్ తో స్టార్ట్ అయిన ఈ వ్యవహారం.. కేసీఆర్ చుట్టూ దెయ్యాల కామెంట్స్ తో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టివేట్ చేయడం.. వరుసగా నిరసన కార్యక్రమాలు, కవుల సన్మాన కార్యక్రమం ఇలా ఏదో ఒక రకంగా తన అస్తిత్వాన్ని చాటిచెప్పుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది.

కానీ బీఆర్‌ఎస్‌ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను అనూహ్యంగా పక్కకు తప్పించారు. కవిత స్థానంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న కవిత.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అదిష్టానానికి ఊహించని ఝలక్ ఇచ్చారు. సింగరేణిలో స్వతంత్ర సంఘంగా ఉన్న హెచ్‌ఎంఎస్‌తో జత కట్టారు.

mlc-kavitha-elected-unanimous-as-honorary-president-of-hms

అధ్యక్షురాలిగా ఏకగ్రీవం..

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో హెచ్ఎంఎస్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఎమ్మెల్సీ కవిత సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రతిపాదించగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

యూనియన్ చరిత్ర..

హిందూ మజ్ధూర్‌ సభ (హెచ్‌ఎంఎస్‌) కార్మిక సంఘం సింగరేణిలో జాతీయ కార్మిక సంఘంగా ఉంది. గతంలో సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో రెండు, మూడు డివిజన్లలోనూ విజయం సాధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బీఆర్‌ఎస్‌ తో కలిసి పనిచేసింది. అప్పటి నుంచి హోం మంత్రిగా పనిచేసిన కాలం వరకు హెచ్ఎంఎస్‌కు గౌరవ అధ్యక్షుడిగా నాయిని నర్సింహారెడ్డి పనిచేశారు. అయితే ఆ తర్వాత యూనియన్‌ లో వచ్చిన విబేధాల నేపథ్యంలో నాయినిని ఆ సంఘం పక్కన పెట్టినట్లు ప్రకటించింది.

ఇక జాతీయ కార్మిక సంఘంగా ఉన్న హెచ్‌ఎంఎస్‌ పలు కేంద్ర, రాష్ర్ట పరిశ్రమాల్లోనూ పట్టు కలిగి ఉంది. ఆ యూనియన్‌కు జాతీయ స్థాయిలో నాయకత్వం ఉన్నప్పటికీ సింగరేణిలో మాత్రం కొంత స్వతంత్ర సంఘంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు కవితను సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికవడంతో.. సింగరేణిలో టీబీజీకేఎస్‌కు ప్రత్యామ్నయంగా హెచ్‌ఎంఎస్‌ను బలోపేతం చేసి బీఆర్‌ఎస్‌కు సవాలు విసిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు ఈ భేటీలో పలు విషయాలపై తీర్మానాలు చేశారు. ఏవేంటంటే..

  • పాత వీఆర్ఎస్ స్కీమ్‌ను పునరుద్ధరించడం
  • వేలంపాట లేకుండా తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కేటాయించడం
  • సింగరేణి కార్మికులకు పెర్క్స్ రీయింబర్స్‌మెంట్ కింద ఐటీ రిటర్న్స్ ఇప్పించడం
  • సింగరేణిలో అలియాస్ మారుపేరుల సమస్యతో బాధపడుతున్న కార్మికులను వన్ టైం సెటిల్మెంట్
  • అనారోగ్య సమస్యలతో అండర్ గ్రౌండ్ అన్‌ఫిట్ అయిన కార్మికునికి బేసిక్ ప్రొటెక్షన్ & సూటబుల్ జాబ్
  • కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయడం
  • సింగరేణిలో పెండింగ్ విజిలెన్స్ కేసులను క్రమబద్ధీకరించడం
  • జైపూర్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న భూనిర్వాసితులకు రెగ్యులరైజ్ చేయడం
  • సింగరేణి కార్మికులకు కంపెనీ లాభాల వాటా 35% ఇప్పించడం
  • సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్‌కి కంపెనీ లాభాల్లో 10% వాటా
  • సింగరేణిలో పనిచేస్తున్న మహిళలకు వాళ్ల విద్యార్హతకు తగిన ఉద్యోగాలు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+