రాహుల్ జీ! మీరు అదే అనుకుంటున్నారా?: రేవంత్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కవిత, భారీ ధర్నా

హైదరాబాద్: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ అంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్ ఉండాలన్నారు. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ నగరంలోని విద్యుత్‌సౌధ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కవిత పాల్గొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొని రేవంత్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతులకు సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యుత్, కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు.

MLC Kavitha fires at Revanth reddy and congress party for Farmers free electricity issue

రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ అని అర్థమైందని కవిత వ్యాఖ్యానించారు. 60 ఏళ్లపాటు దేశంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వదని కవిత ప్రశ్నించారు.

పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వొద్దు అనే ధైర్యం రేవంత్ కు ఉందా? అని నిలదీశారు. మూడు పూటలా అన్నం పెట్టే రైతన్నలకు 3 గంటలే విద్యుత్ ఇవ్వాలనే రేవంత్‌ను ఊరి పొలిమేర వరకు తరిమికొట్టాలన్నారు. రైతులకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని.. అప్పటి వరకు కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనీయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరోవైపు, ట్విట్టర్ వేదికగానూ రేవంత్, కాంగ్రెస్ పార్టీపై కవిత విమర్శలు గుప్పించారు. 'రైతులకు 24 గంటల ఉచిత కరెంటు విషయంలో ఏ రాజకీయ పార్టీకైనా ఇబ్బంది ఎలా వస్తుంది? రైతులకు కేవలం 3 గంటలే కరెంటు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు టీపీసీసీ చెప్పడంతో షాక్‌కు గురయ్యాను. రాహుల్‌గాంధీ..
ఇప్పుడు మీరు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల ఉచిత కరెంటును మీ కాంగ్రెస్ పార్టీ అందించలేకపోయినందున.. మీరు తెలంగాణ రైతులను దెబ్బతీయాలనుకుంటున్నారా? బీఆర్‌ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను అన్ని విధాలా కాపాడుతుంది. అందరం కలిసి ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటాం' అని కవిత వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+