హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాస్కెల్స్: రాజకీయ నేతలపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

రాజకీయ నాయకులు రాస్కెల్స్.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..!

హైదరాబాద్: రాజకీయ నాయకులపై తెలుగు సినీ నటుడు మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ 2018లో రెండో రోజు శుక్రవారం ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

"ఫాదర్ టు డాటర్: డిఎన్ఎ ఆఫ్ యాక్టింగ్" అనే పేరుతో జరిగిన సెషన్‌లో తన కూతురు మంచు లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరు అని ఆయన అన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని మోహన్ బాబు అన్నారు.

మచ్చ లేకుం డా పూర్తి చేశా...

మచ్చ లేకుం డా పూర్తి చేశా...

తన స్నేహితుడు, తనకు అన్న అయిన ఎన్టీ రామారావు చాలా మంచి వ్యక్తి అని, లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదని మోహన్ బాబు అన్నారు. తనను ఎన్టీఆర్ రాజ్యసభక పంపించారని, ఎటువంటి మచ్చ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

95 శాతం మంది రాజకీయ నేతలు...

95 శాతం మంది రాజకీయ నేతలు...

95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తున్నారని అంటూ వాటిని నిలబెట్టుకునేవారెవరు అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాట నిలబెట్టుకుని ఉంటే బారతదేశం ఇంకా మంచి స్థానంలో ఉండేదని ఆయన అన్నారు.

కింగ్ మేకర్‌లా ఉండాలని...

కింగ్ మేకర్‌లా ఉండాలని...

తన తండ్రి మోహన్ బాబు కింగ్లా కాకుండా కింగ్ మేకర్‌లా ఉండాలని కోరుకున్నారని మంచు లక్ష్మి చెప్పారు. నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మోహన్ బాబు స్వభావమని ఆమె అన్నారు.

ప్రచారం చేసి గెలిపించారు..

ప్రచారం చేసి గెలిపించారు..

తన తండ్రి కింగ్ మేకర్ అని, సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారి తరఫున ప్రచారం చేసి వారిని గెలిపించారని ఆమె చెప్పారు. ఈ సమావేశానికి వచ్చినవారిలో చాలా మంది తన తండ్రికి తెలియదని, అయినా కూడా భయపడకుండా తన మనసులో న్నది వెల్లడించడానికి సంకోచించలేదని ఆమె గుర్తు చేశారు.

English summary
Tollywood actor Mohan Babu made conroversial comments on politicians in India Today South Conclave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X