బిజెపికి మేలు చేసిన అమీర్‌ఖాన్!: కమలం నేతకు 86శాతం మద్దతు, ఏమన్నారు?
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో అసహనం ఉందని, తన భార్య కిరణ్ రావు దేశం విడిచి వెళ్లిపోదామని తనతో చెప్పిందని అమీర్ ఖాన్ నాలుగు రోజుల క్రితం అన్నారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. బుధవారం ఆయన దీనిపై ఒకింత తగ్గారు.
ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఒకటి అమీర్ ఖాన్ వ్యాఖ్యల పైన ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో 86 శాతానికి పైగా మంది బిజెపి (భారతీయ జనతా పార్టీ)ని సమర్థించారు.

బిజెపి నేతలు అమీర్ ఖాన్ పైన మండిపడుతున్నారు. బిజెపి నేత షాన్ వాజ్ హుస్సేన్ మాట్లాడుతూ... 'భారత ముస్లింకు భారత్ కన్నా మంచి దేశం, హిందువుల వంటి మంచి పొరుగువాళ్లు దొరకరు' అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల పైన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. 86.5 శాతం మంది షాన్ వాజ్ హుస్సేన్‌కు మద్దతు పలికారు. ఓటింగులో 22వేలకు పైగా మంది పాల్గొన్నారు. అందులో 19వేల మందికి పైగా షాన్‌వాజ్ హుస్సేన్‌ను సమర్థించారు. భారత్ కన్నా మంచి దేశం దొరకదని వారు అభిప్రాయపడ్డారు.రెండు వేల మందికి పైగా మాత్రమే షాన్ వాజ్ హుస్సేన్‌తో ఏకీభవించలేదు.












Click it and Unblock the Notifications