వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ, ఐదుగురు ఆడ‌పిల్ల‌ల‌ ధీన గాథ

జీవిత‌మ‌నె ఆట‌లో ఆమె పాత్ర‌గానె మిగిలిపోయింది, క‌ట్టుకున్న‌వాడు త‌మ‌కు క‌లిగిన అయిదుగురి కూతుళ్ల‌కు అన్నం పెడుతాడ‌నుకుంటె, గుండెపోటుతో మృతి చెంద‌టం అ త‌ల్లీని క‌న్నీటి ఉబిలోకి నెట్టింది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: జీవిత‌మ‌నె ఆట‌లో ఆమె పాత్ర‌గానె మిగిలిపోయింది, క‌ట్టుకున్న‌వాడు త‌మ‌కు క‌లిగిన అయిదుగురి కూతుళ్ల‌కు అన్నం పెడుతాడ‌నుకుంటె, గుండెపోటుతో మృతి చెంద‌టం అ త‌ల్లీని క‌న్నీటి ఉబిలోకి నెట్టింది. అయిదుగురి బిడ్డ‌లు, అత్త‌,ఆమె త‌ల్లిని పోషిస్తూ కుటుంబాన్ని గ‌డుపుతున్న ఓ ద‌య‌నీయ‌మైన దీన‌గాధ ఇది....

గుండెపోటు వ‌చ్చింది

గుండెపోటు వ‌చ్చింది

జ‌గిత్యాల్ జిల్లా మేడిప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామానికి చెందిన జంగిలి గంగాధ‌ర్‌, ల‌త‌ల‌కు ఐదుగురు ఆడ‌పిల్ల‌ల సంతానం, గంగాధ‌ర్ వృత్తిరిత్యా డ్రైవ‌ర్‌గా చేసెవాడు, అయితె మ‌నం ఒక‌టి త‌లిస్తే విధి ఇంకోటి త‌లిసింది వారికి, డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూండానె గంగాధ‌ర్‌కు గుండెపోటు వ‌చ్చింది, అసుప‌త్రికి తీసుకువెళ్లెలోపు మ‌ర‌ణించాడు.

కుటుంబ పోష‌ణ క‌ష్ట‌ం

కుటుంబ పోష‌ణ క‌ష్ట‌ం

అయిదుగురు ఆడ‌పిల్ల‌లు, ఇద్ద‌రు వృద్దులు ల‌త అది వారి కుటుంబం, పుట్టిన పిల్లంద‌రు ప‌ది సంవ‌త్స‌రాల వ‌య‌సువారె, కుటుంబ పోష‌న క‌ష్ట‌మైంది, తెచ్చుకున్న అప్పులు కుప్ప‌లవుతున్నాయి, ల‌త‌కు త‌న క‌ళ్ల‌ముందు భ‌ర్త చ‌నిపోయిన గుర్తులు ఒక‌వైపు వేదిస్తుంటె, ప‌సి హృద‌యాలు ఆక‌లితో క‌న్నీళ్లు పెడుతుండ‌టం మ‌రోవైపు క‌నిపించాయి, ఏడుగురి పోష‌న ఎలా అని రోద‌న చెందింది, ఆవేద‌న చెందింది, క‌న్నీరు కార్చీ ,కార్చీ చిన్న‌బోయాయి, ఎన్నో నిదుర‌లేని రాత్రులు గ‌డుపుతుంది.

రేయింబవళ్లు, బీడీలు చుట్టినా

రేయింబవళ్లు, బీడీలు చుట్టినా

త‌న‌కు వ‌చ్చిన‌, తెలిస ప‌ని ఒక‌టె, బీడిలు చుట్టం, రేయింభ‌వ‌ళ్లు బీడిలు చుట్టినా, నెలకు 3000 కంటె ఎక్కువ రావు, అయితె పిల్ల‌ల అన్నానికి కూడా అవి స‌రిపోవు, ఎలా అని చుట్టుప‌క్క‌లో కూళీ ప‌నికి వెళుతుంది, వ‌చ్చిన డ‌బ్బుల‌తో త‌లో ఇంత తింటు కుటుంబాన్ని పోషించుకుంటుంది. ల‌త అత్త‌మ్మ వృద్దురాలైయింది, ఆమె అమ్మ‌కూడా ల‌త‌కు బారంగా మారింది, గంగాధ‌ర్ చ‌నిపోయెవ‌ర‌కు అప్పుల కుప్ప‌ల్లోనె జీవ‌నం గ‌డిచింది ఏ రోజు ఓ రూపాయి ప‌క్క‌నేసిన పాపాన పోలేదు, ఉండ‌టానికి ఇళ్లు లేదు, కట్టుకోవ‌టానికి గుడ్డ‌లేదు, త‌న అయిదుగురు ఆడ‌పిల్ల‌ల‌తో పాటు అత్త‌ల‌ను సాకుతుంది ల‌త‌.

 ఆకలి అని పిల్లలు

ఆకలి అని పిల్లలు

అమ్మ ఆక‌లి అని పిల్ల‌లు రోదిస్తుంటె వారి ఆక‌లికేక‌లు విన‌లేకా, చుట్టుప‌క్క‌ల‌వాళ్లు చెరోముద్ద‌వేసి వారి ఆక‌లి తీర్చుతున్నారు, ఒక‌రినె సాక‌టం క‌ష్ట‌మంటె అయిదుగురి ఆడ‌పిల్ల‌ల‌ను సాక‌టం అమెకు త‌ల‌కుమించిన భార‌మ‌వుతుంది. రాష్ర్ట‌ప్ర‌భుత్వం పేద‌ల‌కోసం ఎన్నో ప‌ధ‌కాలు ప్రవేశపెట్టాయి. పిల్ల‌ల‌ను క‌స్తుర్బా పాఠ‌శాల‌లో, వారికి ఉండ‌టానికి ఓ ఇళ్లు, ఉపాధి క‌ల్పించాల‌ని గ్రామ‌స్తులు కోరుతున్నారు.త‌మ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని, త‌మ‌కు ఎవ‌రైన సాయం చేయాల‌ని ఆ అమ్మ కోరుతుంది. ఎవ‌రైన దాత‌లు స్పందించి సాయం చెయ్యాల‌నుకుంటె, జంగిలి ల‌త‌, గ్రామం కొండాపూర్‌, మండ‌లం మేడిప‌ల్లి, జిల్లా జ‌గిత్యాల్‌....

ఫోన్ _9666667860 సంప్ర‌దించ‌గ‌ల‌రు..

English summary
Mother with five childrens:the sad story
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X