బరాబర్.. నువ్ చస్తే 20 లక్షలిస్తా: కవితపై అరవింద్ మళ్ళీ అదేమాట!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్య తాజాగా వాగ్యుద్ధం కొనసాగుతుంది. నిన్న నిజామాబాద్ లో బతుకమ్మ ఆడుకోడానికి వెళ్ళిన కవితను ఉద్దేశించి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలతో రచ్చ కొనసాగుతుంది.
బతికుండగా ఆరోగ్య బీమా ఇవ్వలేని సీఎం కేసీఆర్ చనిపోయిన తర్వాత ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని కానీ మంత్రి కేటీఆర్ చనిపోతే 10 లక్షలు, ఎమ్మెల్సీ కవిత చనిపోతే 20 లక్షలు బీమా తాను ఇస్తానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలతో ఆవేదన వ్యక్తం చేసిన కవిత నువ్వు చనిపోతే 20 లక్షలు ఇస్తాం.. మీ అన్న చచ్చిపోతే 10 లక్షలు ఇస్తా.. మీ నాన్న ఇట్లా అంటూ అరవింద్ మాట్లాడడం, ఇటువంటి భాషను ఉపయోగించటం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలని కవిత విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆడబిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నారని, ఇలా అడ్డగోలుగా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు.
కెసిఆర్ బిడ్డను కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని కవిత హితవు పలికారు. ఆ మాటలే వాళ్ళ ఇంట్లో ఆడవారిపై మాట్లాడితే భరించగలరా అంటూ ధర్మపురి అరవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర పాలకులు కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదని కవిత పేర్కొన్నారు.
దీంతో మళ్లీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ధర్మపురి అరవింద్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు. బరాబర్ మీరు చస్తే డబ్బులు ఇస్తాను అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నువ్వు తెలంగాణ ఆడబిడ్డవా అంటూ ప్రశ్నించిన ధర్మపురి అరవింద్ తెలంగాణ ఆడబిడ్డలు ఇట్లానే చేస్తారా అంటూ కవితను ఎద్దేవా చేశారు.
తాను ఇంట్లో లేనప్పుడు తన ఇంటికి కొందరిని పంపి ఇంట్లో కుర్చీలు పగలగొట్టినప్పుడు ఏమైంది నీ ఆడపడుచుతనమంటూ ప్రశ్నించారు. నువ్వేమో ఆడపడుచువు కానీ మా అమ్మ కాదా అంటూ నిలదీశారు. నన్ను చెప్పుతో కొడతాను అన్నావని, నీకు అంత సీన్ ఉందా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఆంధ్రావాళ్లు మంచోళ్ళు అయ్యారా.. ఆంధ్ర వాళ్ళను కుక్కలు అన్న మాటలు మర్చిపోయారా అంటూ కవితపై విరుచుకుపడ్డారు ధర్మపురి అరవింద్.












Click it and Unblock the Notifications