వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్.. ఏఐసీసీకి జాబితా; టాప్ లో ఎవరంటే!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేయగా, అభ్యర్థి ఎంపికపై ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మునుగోడు ఉపఎన్నిక మారడంతో అభ్యర్థి ఎంపికపై ఆచి తూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

మునుగోడు కాంగ్రెస్ ఫైనల్ జాబితా ఏఐసీసీకి ... తుది నిర్ణయం అధిష్టానానిదే

మునుగోడు కాంగ్రెస్ ఫైనల్ జాబితా ఏఐసీసీకి ... తుది నిర్ణయం అధిష్టానానిదే

ఈ నెలాఖరుకల్లా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఫైనల్ చేయాలని ఇటీవల ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేసిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టీపీసీసీ నాయకులు అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇక అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నలుగురు నేతలకు సంబంధించి నియోజకవర్గ సర్వే నివేదికను సోషల్ మీడియా ఇంచార్జ్ సునీల్ బృందం టీపిసిసి పెద్దలకు అందజేయడంతో దానిని వారు ఏఐసిసికి పంపించారు. ఇక ఈ నివేదికను బట్టి పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు, ఫైనల్ నిర్ణయం అధిష్టానం తీసుకోనున్నట్టు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

టాప్ లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి

టాప్ లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి


మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల బరిలో దిగడానికి టిక్కెట్ ఆశిస్తున్న నలుగురు నేతలలో టాప్ లో మాజీమంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఉన్నట్టు సమాచారం . గతంలో ఈ నియోజకవర్గం నుండి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఐదుసార్లు గెలుపొంది తిరుగులేని నేతగా ఎదిగారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె అయిన పాల్వాయి స్రవంతి కూడా నియోజకవర్గంలో అంతే ప్రాధాన్యత ఉన్నట్టు కాంగ్రెస్ సర్వేలో వెల్లడైంది. పాల్వాయి స్రవంతికి వచ్చినంత ఓట్లు చల్లా కృష్ణారెడ్డి కి కూడా వచ్చాయని, అయినప్పటికీ పాల్వాయి స్రవంతి ముందు, ఆయన ప్రాధాన్యత రెండో స్థానం లో ఉన్నట్లు తెలుస్తోంది.

సర్వేలో పాల్వాయి స్రవంతికి కలిసి వచ్చిన అంశం ఇదే

సర్వేలో పాల్వాయి స్రవంతికి కలిసి వచ్చిన అంశం ఇదే

2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి అప్పుడు ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇక 2018 ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించడంతో పాల్వాయి స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకున్నారు. కోమటిరెడ్డి గెలుపు కోసం పని చేశారు. ఈ పరిణామమే ఈ సర్వేలో పాల్వాయి స్రవంతి కి కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు.

 అధిష్టానానికి పంపిన ఫైనల్ జాబితాలో నలుగురి పేర్లు .. అవకాశం ఎవరికో?

అధిష్టానానికి పంపిన ఫైనల్ జాబితాలో నలుగురి పేర్లు .. అవకాశం ఎవరికో?


ఇక ఇదిలా ఉంటే అధిష్టానానికి పంపిన ఫైనల్ జాబితాలో రాజకీయ నాయకుడిగా మారిన జర్నలిస్టు పల్లె రవికుమార్ పేరు, చల్లా కృష్ణ రెడ్డి పేరు, కైలాష్ నేత పేరు ఉన్నట్టు సమాచారం. మొత్తానికి నలుగురు పేర్లు తుది జాబితాలో ఉండగా వీరి బలాబలాలను టి పి సి సి, ఏఐసీసీకి పంపించి అభ్యర్థిని ఫైనల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇక ఏఐసిసి నివేదిక ఆధారంగా ఎవరి పేరును ఫైనల్ చేస్తే వారే కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నిక బరిలో రంగంలోకి దిగుతారని సమాచారం. మరి ఏఐసిసి ఎవరి పేరు ఫైనల్ చేస్తుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తున్నా, పాల్వాయి స్రవంతికే ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

English summary
In munugode by election congress candidates list was received by AICC to finalize the Congress candidate. It is reported that there is Palvai sravanthi in the top.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X