టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఆర్మూర్ శాసన సభ్యుడు జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గల వేమూరీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటోన్నారు. ఆయన నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కత్తి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జీవన్ రెడ్డిపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంటి వచ్చినట్లు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. 2014, 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపైనే సుమారు 30 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గల వేమూరీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటోన్నారు.

Murder attempt on TRS MLA from Armur Jeevan Reddy, one person arrested by the police

గుర్తు తెలియని వ్యక్తి ఆయన నివాసం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు అప్రమత్తం అయ్యారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా నిర్ధారించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే క‌త్తి, పిస్టల్‌తో ఆయన ఇంటికి వచ్చాడని ధృవీకరించారు. నిందితుడిని ప్ర‌స్తుతం బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు అతనిపై క్రిమినల్ కేసులు ఏవైనా ఉన్నాయా? అనే విషయంపై దర్యాప్తు సాగిస్తున్నట్లు చెప్పారు. నిందితుడి వద్దకు పిస్టల్ ఎలా వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+