కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నేవీ జవాను మృతి

నల్గొండ: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన నేవీ జవాన్​ మారెడ్డి సందీప్​ రెడ్డి(26) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నర్సింహాపురానికి చెందిన సందీప్​ రెడ్డి నేవీ జవాన్‌​గా కర్ణాటకలోని నావెల్​ బేస్‌​లో సైలర్‌​గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో మే 28వ తేదీన కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురవ్వగా స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్.. గురువారం మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. సందీప్ మృతితో నకిరేకల్ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. భారత నేవీ గౌరవవందనంతో అంత్యక్రియలు నిర్వహించారు.

Navy Soldier belongs to Nalgonda district Died in Karnataka Road Accident

ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు, 21 మంది మృతి

జమ్మూకాశ్మీర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ-పూంఛ్ రహదారిపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రక్షణ బలగాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో సహాయక బృందాలు చేర్పించాయి. బస్సులో 80 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్మూ-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలోపడిపోయిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+