నయీం అనుచరుడు కృష్ణారావు అరెస్టు: ముంబై శివారుల్లో ఆస్తులు
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం మరో అనుచరుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే నయీం అనుచరులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, కృష్ణమూర్తి అలియాస్ కృష్ణారావును సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణారావుకు ముంబై, హైదరాబాద్ శివార్లలో ఖరీదైన ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. నయీం బంధువు సలీమాబేగంకు కృష్ణారావు సన్నిహితుడు. నయీం అండదండలతోనే కృష్ణారావు ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. కృష్ణారావుపై భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్ వంటి పలు కేసులు ఉన్నట్టు తెలిసింది.
అదే సమయంలో నయీం మరో అనుచరుడు శివను అదుపులోకి తీసుకున్నారు. నయీం ముఖ్య అనుచరులతో శివ ఫోన్ సంభాషణలు జరిపినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా శివ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన శివ అలియాస్ శివకుమార్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది.

ఇదిలావుండగా నయీంకు ఆయుధాలు సమకూర్చిన శ్రీధర్‌గౌడ్, సమీరుద్దీన్‌ను 9రోజుల పాటు కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. వీరి నుంచి నరుూంకు చెందిన డంప్‌ల సమాచారాన్ని రాబడుతున్నట్టు సమాచారం.
ఇదిలావుండగా నయీం అక్రమ వ్యవహారాలపై నల్గొండ, మెదక్ జిల్లాల్లో మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి.నల్గొండకు చెందిన మహేశ్వరి, ఎద్దుమైలారం గ్రామానికి చెందిన డిఫెన్స్ అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications