నయీం క్రూరత్వం: చెల్లి వరుస ఫర్హానాతో అక్రమ సంబంధం, స్త్రీల నడుములకు వెపన్స్

హైదరాబాద్: మహిళలను ఓ పద్ధతి ప్రకారం నయీం తన వశం చేసుకున్నట్లు అర్థమవుతోంది. నయీం మహిళా అనుచరులుగా మారిన ఫర్ఙానా, అఫ్షాలు తొలుత అతని బాధితులేనని, ఆ తర్వాతే అతనికి నమ్మకస్తులైన అనుచరులుగా మారారని అంటున్నారు. వారిద్దరిని అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం ఇంట్లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మొదటి రోజుల్ల నయీం క్రూరత్వాన్ని వారు అనుభవించారని, ఆ తర్వాతనే అతని అనుచరులుగా, అతని ఆస్తులకు బినామీలుగా మారారని చెబుతున్నారు. నయీం రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో మహిళల వద్ద ఆయుధాలు ఉంచేవాడని పోలీసుల విచారణలో తేలింది. మహిళలకు జీన్స్ ప్యాంట్స్ వేసి, వారి నడుముల వద్ద ఆయుధాలు పెట్టి, బుర్షాలు వేసేవాడని చెబుతున్నారు.

ఫర్హానా చరిత్ర ఇదీ...

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలన్‌కు చెందిన ఫర్హానాకు 1999లో మిర్యాలగుడాకు చెందిన సయ్యద్ అహ్మద్‌త పెళ్లయింది. వారికి ముగ్గురు కుమారులు. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2007లో భర్త మరణించడంతో ఫర్హానా అత్తారింట్లోనే ఉంటూ వచ్చింది.

వరుసకు అన్న అయిన నయీం ఇంట్లో పిల్లలను చూసుకునే పని చేయాల్సిందిగా అత్త చెప్పడంతో ఫర్హానా అంగీకరించింది. తన మూడో కుమారుడు సలీంను తీసుకుని నయీం చెంతకు చేరింది. అప్పట్లో నయీం హయత్‌నగర్‌లో రంగన్న అనే పేరుతో ఉన్న ఇంట్లో నివసించేవాడని సమాచారం.

ఇంట్లో యువతులపై జరిగే ఘోరాలను ఎవరికైనా చెప్తే చంపేస్తానని నయీం ఫర్హానాను బెదిరించాడు. సలీంను తీవ్రంగా హింసించాడు. దాంతో అతను నడవలేని స్థితికి చేరుకున్నాడని చెబుతున్నారు. నయీం ఫర్హానాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని మూడంతస్తుల భవనంలో మూడో అంతస్తులో జిమ్ ఉండగా, రెండో అంతస్తులో నయీం భార్యాపిల్లలతో ఉండేవాడు

మొదటి అంతస్తులో ఫర్హానాతో పాటు యవతులు, బాలికలు, గ్రౌండ్ ఫ్లోర్‌లో డ్రైవర్ కెసిఆర్ అలియాస్ కిశోర్ ఉండేవాడు. నయీం తమపై చేస్తున్న అకృత్యాలను మైనర్లు అప్పుడప్పుడు ఫర్హానాతో చెప్పేవారు. వారిని ఆమె ఓదారుస్తున్న విషయం తెలుసుకున్న నయీం శిక్షగా ఆమెకు గుండు గీయించాడు.

ఫర్హానాను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆమెను నేరాల్లో భాగస్వామిని చేశాడు. సొంత బావ నదీంను చంపిన తర్వాత శవాన్ని కొత్తురూ తీసుకుని వెళ్లి కాల్చేయడానికి ఫర్హానాను వెంట తీసుకుని వెళ్లాడని అంటున్నారు.

 Nayeem used ladies to cover his identity

అఫ్షా చరిత్ర ఇదీ...

నల్లగొండ జిల్లా మిర్యాలగుడా సమీపంలోని ఈదులగూడెంకు చెందిన అఫ్షా వరుసకు నయీం మేనకోడలు. ఈమె తండ్రికి భువనగిరిలో కేబుల్ నెట్‌వర్క్ ఉండేది. భువనగిరిలో పదో తరగతి వరకు చదివిన అఫ్షాను చదువు ఆపించి తన వద్దకు పంపించాలని నయీం ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు.

దాంతో అఫ్షాను తల్లిదండ్రులు 2010లో మిర్యాలగుడాకు చెందిన అమీర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. డిగ్రీ చదివిన అమీర్ ఉద్యోగం లేక ఖాళీగా ఉండేవాడు. ఏడాది తర్వాత వారికి పూప పుట్టింది. ఓ సందర్భంలో బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లిన నయీం వారిని అక్కడ చూశాడు. హైదరాబాద్ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు.

దాంతో వారిద్దరు పాపతో నయీం ఇంటికి వచ్చారు. కొన్ని రోజుల కోసం అమీర్‌ేటలో అమీర్ ఓ ప్రైవేట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. బావ నదీంను హత్య చేయడానికి నిర్ణయించుకున్న నయీం ఆ పని పూర్తి చేశాడు. అప్పటి నుంచి అఫ్షా జీవితం నయీం చెప్పుచేతల్లోకి వెళ్లింది.

వార జాడ తెలియడం లేదు...

అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంటికి మారడానికి ముందు నయీం షాద్‌నగర్‌లో ఓ ఇంట్లో కొంత కాలం ఉన్నాడు. అక్కడ ఏడాది పాటు తన తమ్ముడి భార్య హీనా, కూతురు చియాన్‌లను తీవ్రంగా హింసించాడు. దాంతో వారు కనిపించకుండా పోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే నయీం మిర్యాలగుడా నుంచి సాదియా, మాలియా, జోహా అనే యువతులను చదివిస్తానంటూ తీసుకుని వచ్చాడు. ఆ ముగ్గురిపై కూడా నయీం లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారితో పాటు నయీం తమ్ముడి కూతురు షమ, బంధువు ఆషు ఎక్కడున్నారో తెలియడం లేదు.

నడుములకు ఆయుధాలు...

రాష్ట్ర సరిహద్దలు దాటే సమయంలో తన వెంట ఉండే శమ అలియాస్ అహేలా, సదా అలియాస్ నీలోఫర్, కరీనా అలియాస్ అప్సలను తీసుకుని వెళ్లేవాడు. వారికి జీన్స్ వేసి నడుములకు ఆయుధాలు చుట్టేవాడు. ఆ తర్వాత బుర్షా వేయించి తనతో పాటు తీసుకుని వెళ్లేవాడు. వారి ఆచూకీ కూడా తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+