నడిరోడ్డుపై కారు ఆపి డోరు తెరిచిన డ్రైవర్.. రెండేళ్ల చిన్నారి మృతి (వీడియో)

హైదరాబాద్: ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్‌లో నివసించే సయ్యద్ హబీబుద్దీన్, శశిరేఖ దంపతులకు రేఖ అనే రెండేళ్ల చిన్నారి ఉంది. శశిరేఖ బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సేవలందించేందుకు మన్సూరాబాద్‌కు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో భర్త హబీబుద్దీన్, కుమార్తెతో కలిసి ఎన్టీఆర్ నగర్‌కు బయల్దేరారు.

negligenceofcardriver

గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కామినేని హాస్పిటల్ మార్గంలో ఆగివున్న ఓ కారు డోర్‌ను డ్రైవర్ హఠాత్తుగా తెరవడంతో వెనుక నుంచి వస్తున్న వీరి బైక్‌కు తగిలింది. దీంతో ముగ్గూరు రోడ్డుపై పడిపోయారు. చిన్నారి తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ధనలక్ష్మి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులు అప్పగించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వెనుక వచ్చే వారిని గమనించకుండా కారు డోరు తీసి ఓ చిన్నారి మరణానికి కారణమయ్యాడని మండిపడుతున్నారు.

కాగా, సకాలంలో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లివుంటే బతికేదని చిన్నారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, ఘటనకు కారణమైన కారులోనే వెంటనే ఆస్పత్రికి తరలించివుంటే సరైన సమయంలోనే ఆస్పత్రికి చేరేవారిమని వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+