కేసీఆర్-జగన్ మధ్య తేడా ఇదీ: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరుతో రాజకీయ పరిణితి: మర్రి

హైదరాబాద్: ఉగాది నుంచి ఏపీలో మనుగడలోకి రాబోతోన్న కొత్త జిల్లాల అంశం- తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. జిల్లాలకు పెట్టిన పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలంటూ ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దామోదరం సంజీవయ్య చేసిన సేవలను గుర్తు చేశారు.

 చెన్నారెడ్డి హయాంలో మూడు జిల్లాలు..

చెన్నారెడ్డి హయాంలో మూడు జిల్లాలు..

ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని శశిధర్‌రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం, అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రాన్ని నిర్ధారించడం మంచి నిర్ణయమని వ్యాఖ్యానించారు. రాయచోటి, పుట్టపర్తిని ఆయన దీనికి ఉదహరించారు.

ముందుచూపుతో..

ముందుచూపుతో..

రాజంపేట పార్లమెంట్ స్థానమే అయినప్పటికీ.. దీనికి దూరంగా ఉన్న మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. మధ్యలో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏపీ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. ప్రతి కొత్త జిల్లాలోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్య సమానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం.. అక్కడి ప్రభుత్వ ముందుచూపునకు నిదర్శనమని చెప్పారు. వీటన్నింటినీ బట్టి చూస్తే.. కొత్త జిల్లా ఏర్పాటు వ్యవహారం ఆషామాషీగా జరగలేదనేది అర్థమౌతోందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్ పేరుతో..

ఎన్టీఆర్ పేరుతో..

పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలను తీసుకుందని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు అభినందనీయమని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టడం.. వైఎస్ జగన్ రాజకీయ పరిణితికి అద్దం పట్టిందని పేర్కొన్నారు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అనే అపవాదును ఆయన తొలగిపోయినట్టవుతుందని శశిధర్ రెడ్డి చెప్పారు.

సమగ్రంగా అధ్యయనం..

సమగ్రంగా అధ్యయనం..

పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి ఉంటే ఇబ్బందులు వస్తాయని ఏపీ ప్రభుత్వం ముందే అధ్యయనం చేసిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. సత్య సాయిబాబా పేరు పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని అన్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్.. ఇదివరకే చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో ఏపీని పోల్చారు.

 రాజకీయ పట్టు కోసం..

రాజకీయ పట్టు కోసం..

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి సమీక్షలు చేయలేదని, హడావుడిగా ఈ ప్రక్రియను పూర్తి చేశారని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. దాని వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా, రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాలను సృష్టించారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చేలా జిల్లాల ఏర్పాటు సాగిందని, టీఆర్ఎస్ తన బలాన్ని, పట్టును పెంచుకోవడానికే జిల్లాలను ఏర్పాటు చేసిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+