టెస్టుల్లో 5 లక్షల మార్క్‌ను దాటిన తెలంగాణ: జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో తగ్గని జోరు..అదే దూకుడు

హైదరాబాద్: తెలంగాణలో కొద్దిగా తగ్గముఖం పట్టినట్టు కనిపించిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. సోమవారం నాటి బులెటిన్‌లో అధికారులు నమోదు చేసిన సంఖ్యతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. సోమవారం నాటి వివరాల ప్రకారం.. తెలంగాణలో 981 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్యలో పెరుగుదల కనిపించింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 1283 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 12 మంది మృత్యువాత పడ్డారు.

 అయిదు లక్షలకు పైగా టెస్టులు..

అయిదు లక్షలకు పైగా టెస్టులు..

కాగా, తెలంగాణలో ఇప్పటిదాకా నిర్వహించిన కరోనా వైరస్ శాంపిళ్ల సంఖ్య అయిదు లక్షల మార్క్‌ను దాటుకుంది. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 5,01,025కు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 391 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

50 వేలకు చేరువైగా డిశ్చార్జీలు..

50 వేలకు చేరువైగా డిశ్చార్జీలు..

తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా రికార్డు చేసిన కేసులతో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 68,946కు చేరుకుంది. ఇందులో 49,675 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 563కి పెరిగింది. యాక్టివ్ కేసులు 18,708గా నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్‌ను విడుదల చేసింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతోంది. అరలక్షను చేరుకుంటోంది. డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలవారీగా కేసుల వివరాలివీ..

జిల్లాలవారీగా కేసుల వివరాలివీ..

ఆదిలాబాద్-9, భద్రాద్రి కొత్తగూడెం-38, జగిత్యాల-22, జనగామ-8, జయశంకర్ భూపాలపల్లి-6, జోగుళాంబ గద్వాల-55, కామారెడ్డి-6, కరీంనగర్-101, ఖమ్మం-41, కొమరం భీమ్ ఆసిఫాబాద్-3, మహబూబ్ నగర్-39, మహబూబాబాద్-27, మంచిర్యాల-21, మెదక్-7, ములుగు-5, నాగర్ కర్నూలు-29, నల్లగొండ-29, నారాయణపేట్-4, నిర్మల్-4, పెద్దపల్లి-29, రంగారెడ్డి-121, సంగారెడ్డి-15, సిద్ధిపేట్-14, సూర్యాపేట్-23, వికారాబాాద్-17, వనపర్తి-14, వరంగల్ రూరల్-11, వరంగల్ అర్బన్-63, యాదగిరి భువనగిరి-3 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదు అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.

Recommended Video

    గాంధీ ఆసుపత్రి లో రోజు 30 నుండి 50 మంది కరోనాతో చనిపోతున్నట్లు అనుమానం : జగ్గారెడ్డి
    ముమ్మరంగా శాంపిళ్ల పరీక్షలు..

    ముమ్మరంగా శాంపిళ్ల పరీక్షలు..

    24 గంటల వ్యవధిలో మొత్తం 13,787 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 5,01,025కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ముమ్మరంగా శాంపిళ్ల టెస్టులను కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా కట్టడి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+