తెలంగాణలో తగ్గని కరోనా ఉప్పెన: అదే రేంజ్‌లో కొత్త కేసులు: లక్షకు చేరువగా డిశ్చార్జిలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదు. దాని ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. రోజూ మూడువేలకు కాస్త అటుఇటుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కరోనా వైద్య పరీక్షలకు అనుగుణంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కరోనా కేసుల్లో స్వల్పంగా మార్పులు ఉంటున్నాయే తప్ప పూర్తిగా తగ్గుముఖం పట్టట్లేదు. గ్రేటర్ హైదరాబాద్‌ కలుపుకొని మొత్తం 11 జిల్లాల్లో వందకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే రంగారెడ్డి జిల్లాలో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటోంది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2892 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2240 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య లక్షకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,30,589కి చేరుకుంది. ఇందులో 97,402 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 846కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,341గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 25,271 మంది చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 477 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, నిజామాబాద్, సిద్ధిపేట్, సూర్యాపేట్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Newly 2892 Covid19 positive cases and 10 deaths reported in Telangana last 24 hours

24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-38, భద్రాద్రి కొత్తగూడెం-81, జగిత్యాల-102, జనగామ-43, జయశంకర్ భూపాలపల్లి-21, జోగుళాంబ గద్వాల-28, కామారెడ్డి-64, కరీంనగర్-152, ఖమ్మం-128, కొమరంభీమ్ ఆసిఫాబాద్-13, మహబూబ్ నగర్-53, మహబూబాబాద్-61, మంచిర్యాల-83, మెదక్-32, మేడ్చల్ మల్కాజ్‌గిరి-192, ములుగు-27, నాగర్ కర్నూలు-45, నల్లగొండ-174, నారాయణపేట్-12, నిర్మల్-31, నిజామాబాద్-110, పెద్దపల్లి-85, రాజన్న సిరిసిల్ల-39, రంగారెడ్డి-234, సంగారెడ్డి-71, సిద్ధిపేట్-108, సూర్యాపేట్-108, వికారాబాాద్-15, వనపర్తి-51, వరంగల్ రూరల్-38, వరంగల్ అర్బన్-116, యాదాద్రి భువనగిరి-60 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Jagga Reddy Daughter Jaya Reddy Press Meet | Oneindia Telugu

    కరోనా వైరస్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించారు. కొత్తగా వ్యాప్తంగా 59,421 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 14,83,267కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 39,952 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+