వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్

By Pratap
|
Google Oneindia TeluguNews

2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన ఈఎస్ఎల్ నరసింహన్.. హైదరాబాద్‌లో పారిశ్రామిక అనుకూల వాతావరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్.. ఎక్కువగా నిఘా విభాగంలో పని చేశారు. తర్వాత ఛత్తీస్ గఢ్ గవర్నర్‌గా నియమితులైన నరసింహన్‌ను నాటి యూపీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఏపీకి బదిలీ చేసింది. అప్పటి నుంచి, 2014 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా పని చేస్తున్న నరసింహన్ తెలుగు ప్రజల్లో గుండెల్లో నిలిచిన వ్యక్తిగా నిలిచారు.

Recommended Video

Governor Narasimhan Asking AP Leaders About Hyderabad Vacate | Oneindia Telugu
News Maker 2017: Governor Narasimhan

రాష్ట్ర విభజన సమయంలో ఉద్వేగాలను, ఉద్రేకాలను తగ్గించి, సామరస్య వాతావరణం కల్పించే విషయంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య విభేదాలను పరిష్కరించడానికి వారిద్దరికి మధ్య ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు.

ఇరువురు సిఎంల మధ్య విభేదాలు పొడసూపకుండా, ఇరు రాష్ట్రాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ గవర్నర్‌గా క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిత్యం వార్తల్లో నిలిచిన వ్యక్తిగా పేరు పొందారు.

English summary
As the governor of two Telugu states played key role in solving critical issues between Telangana and Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X