మరో మూడురోజులు వర్షాలు.. చల్లని కబురు అందజేసిన వాతావరణ శాఖ

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా ప్రచండ ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడురోజులపాటు రాష్ట్రంలో గల పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.

తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. తమిళనాడు నుంచి కర్ణాటక వరకు సముద్రమట్టం నుంచి 900 మీటర్ల వరకు ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

next 3 days Rains in telangana state

ఉపరితల ద్రోణి ప్రభావంతో మంచిర్యాల, జైశంకర్ భూపాల పల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే చాన్సుంది.

Recommended Video

    Innovative Auto Driver Jakkaiah Growing Plants In Auto

    ఇటు రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్ లో 41.9 డిగ్రీలు.. ఆర్మూర్ లో ఇస్నాపల్లిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం అతి తక్కువగా ఆదిలాబాల్ లో 12శాతం నమోదైంది. ఓ వైపు ఎండ కొడుతూనే మరోవైపు వాతావరణం చల్లగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+