Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావోయిస్ట్ లకు బిగ్ షాక్: గడ్చిరోలి ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో వారి ఇళ్ళలో ఎన్ఐఏ సోదాల కలకలం!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 14వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర పోలీసులు ఏకంగా 27 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్లో హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మావోయిస్ట్ ల లోగుబాట్లు, ఎన్ కౌంటర్లలో మావోల మృతి ఘటనలు, కరోనా దెబ్బకు చాలా మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోవటం వంటి ఘటనలతో మావోయిస్ట్ పార్టీకి దెబ్బ తగిలింది.

మాజీ మావోలు, మావోయిస్ట్ సానుభూతిపరుల ఇళ్ళలో ఎన్ఐఏ సోదాలు

మాజీ మావోలు, మావోయిస్ట్ సానుభూతిపరుల ఇళ్ళలో ఎన్ఐఏ సోదాలు

ఆ షాక్ నుండి కోలుకోక ముందే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్ఐఏ సోదాలు ప్రజా సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. హైదరాబాద్లోని మాజీ మావోయిస్టు రవి వర్మ, అనురాధ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో విశాఖపట్నంలో ఉన్న అనురాధ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలోని విరసం నేత కళ్యాణ్ రామ్ ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీ చర్చలు ప్రతినిధిగా కొనసాగిన కళ్యాణ్ రావు ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాల నేపథ్యంలో మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.

మావోయిస్ట్ అగ్ర నేత ఆర్కే బంధువు కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు

మావోయిస్ట్ అగ్ర నేత ఆర్కే బంధువు కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే కు కళ్యాణ్ రావు బంధువు కావడంతో ఆయనను అనేక విధాలుగా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వీరి ఇళ్లలో కీలక డాక్యుమెంట్లతో పాటు, పుస్తకాలను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన రవి వర్మ ఇటీవల కాలంలో పోలీసులకు లొంగిపోయాడు. అయినప్పటికీ మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు అన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్ర నేత ఆర్కే జీవిత చరిత్రపై పుస్తక ప్రచురణ పై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ లోనూ ప్రజా సంఘాల నాయకుల ఇళ్ళలో తనిఖీలు

హైదరాబాద్ లోనూ ప్రజా సంఘాల నాయకుల ఇళ్ళలో తనిఖీలు


ఈరోజు ఉదయం 5 గంటలకు ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో విరసం నేత, ప్రముఖ రచయిత అయిన కళ్యాణ్ రావు ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేపట్టారని, ఈ సోదాలపై ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖపట్నంలో ప్రగతిశీల కార్మిక సంఘం నాయకురాలు అన్నపూర్ణ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాయకులు.

హైదరాబాద్ లోని సుభాష్ నగర్ లో అమరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి పద్మ కుమారి, సహాయ కార్యదర్శి భవానిని కూడా విచారిస్తున్నారు. ప్రజా సంఘాల నాయకులను, సాహిత్యకారులను అణగతొక్కడం కోసం వారి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం కోసం ఎన్ఐఏ దాడులు కొనసాగిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలకు మావోలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం.. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎన్ఐఏ సోదాలు

ప్రభుత్వాలకు మావోలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం.. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎన్ఐఏ సోదాలు

ఇటీవల కాలంలో ప్రభుత్వానికి మావోయిస్టులకు, మధ్య ప్రచ్ఛన్న యుద్ధం పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వివిధ రాష్ట్రాలలో మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టి సారించిన ఎన్ఐఏ అధికారులు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేశారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ మూడు రాష్ట్రాలలో మావోయిస్టులు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి, శిక్షణ కేంద్రాలను నిర్వహించడానికి సమాయత్తమయ్యారు అని అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి తమిళనాడు రాష్ట్రంలో 12 చోట్ల, కేరళ, కర్ణాటకలో ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో మావోయిస్ట్ ల సమాచారం కోసం సోదాలను నిర్వహిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+